News March 7, 2025

అభిషేక్ మహంతి తెలంగాణ క్యాడర్ నుంచి రిలీవ్

image

కరీంనగర్ సీపీగా విధులు నిర్వహించిన అభిషేక్ మహంతిని తెలంగాణ క్యాడర్ నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. భూకబ్జాలపై ఉక్కుపాదం మోపిన అధికారిగా అభిషేక్ మంచి పేరు పొందారు. ఆయన కుటుంబంలో ముగ్గురు ఐపీఎస్‌లు ఉన్నారు. తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ ఏకే మహంతి ఎన్టీఆర్, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వివిధ హోదాలో పనిచేశారు. అన్న అవినాష్ మహంతి కూడా ఐపీఎస్ అధికారి.

Similar News

News April 1, 2026

KNR: రూ. 50 కోట్లు దాటిన నగరపాలక ఆదాయం

image

కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్దేశించుకున్న రూ.60 కోట్ల ఆస్తి పన్ను లక్ష్యంలో మెజారిటీ వాటా వసూలైంది. ఇప్పటివరకు మొత్తం ఆదాయం రూ.50 కోట్ల మార్కును దాటినట్లు డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్ వెల్లడించారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 2.07 కోట్లు ఖజానాకు చేరాయి. గడువు ముగియడంతో పన్ను చెల్లింపుదారుల నుంచి భారీ స్పందన లభించింది.

News April 1, 2026

KNR: ఒకేసారి మూడు నెలల రేషన్!

image

కరీంనగర్ జిల్లాలోని రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఏప్రిల్ నుంచి ఎండల తీవ్రత పెరగనుండటంతో, వృద్ధులు, పేదలు ప్రతి నెలా క్యూలైన్లలో నిలబడే ఇబ్బంది లేకుండా ఏప్రిల్, మే, జూన్ నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయనుంది. అలాగే యాసంగి ధాన్యం నిల్వకు గోదాములను ఖాళీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో యూనిట్‌కు 18 కిలోల బియ్యం ఏప్రిల్‌లోనే అందనున్నాయి.

News April 1, 2026

KNR: వివాదాల సుడిగుండంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

image

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు నిత్యం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల వేళ ‘ఓట్లు వేయకుంటే ఆత్మహత్యే’నంటూ కుటుంబంతో వీడియో విడుదల చేయడం నుంచి.. వీణవంక జాతరలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యల వరకు ఆయన ప్రస్థానం వివాదాస్పదమైంది. తాజాగా ఈ కేసులో సీఐడీ విచారణ ఎదుర్కోనున్నారు. మరోవైపు అసెంబ్లీలో కడియం శ్రీహరిపై చేసిన అసభ్య సైగలు తీవ్ర దుమారం రేపగా, స్పీకర్ ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించారు.