News March 7, 2025
సత్యసాయి: ఫోన్ మహిళల జీవితాలను మారుస్తుంది.!

ఒకే ఒక సెల్ ఫోన్ మహిళల జీవితాలను మారుస్తుందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. మహిళ వారోత్సవాల్లో భాగంగా.. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో షార్ట్ ఫిలిం ద్వారా, సెల్ఫోన్ వాడకం, సైబర్ నేరాలు, వాట్సప్ వంటి వాటిపై జరిగే అనర్థాల గురించి విద్యార్థులకు వివరించారు. నిత్యజీవితంలో సెల్ ఫోన్ మహిళల జీవితాలపై విపరీతమైన ప్రభావం చూపుతోందన్నారు.
Similar News
News March 4, 2026
RR: నిఘా నీడలో పరీక్షలు.. 1,916 మంది డుమ్మా

నిఘా నీడలో ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు బుధవారం ఇంటర్ 2nd ఇయర్ పరీక్ష జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 80,463 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 78,547 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,916 మంది విద్యార్థులు వివిధ కారణాలతో హాజరు కాలేకపోయారు.
News March 4, 2026
సంగారెడ్డి జైలు సూపరిండెంట్‌గా సంతోష్ కుమార్ బాధ్యతలు

సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగార సూపరిండెంట్‌గా సంతోష్ కుమార్ రాయ్ బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది ఇదే జైలులో పనిచేసిన ఆయన జూన్‌లో హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ అయ్యారు. తాజాగా ప్రభుత్వం తిరిగి ఆయన్ని సంగారెడ్డికే నియమించడంతో బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జైలు అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
News March 4, 2026
HNK: ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్‌కు 98% హాజరు

నేడు జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్‌కు 98% విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. జనరల్ విద్యార్థులు 17879, ఒకేషనల్ 1017కి 18475 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. జనరల్ విద్యార్థులు 401, ఒకేషనల్ విద్యార్థులు 20 మంది ఆబ్సెంట్ అయ్యారు. విద్యార్థుల హాజరు శాతం 98గా నమోదు అయిందని, ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.


