News March 7, 2025

గద్వాల: ఉపాధి హామీ పనులను వేగవంతంగా పూర్తి చేయండి: కలెక్టర్

image

గద్వాల జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మండలాల వారీగా లేబర్ టర్న్‌ఔట్‌, ఇంజినీరింగ్ పనులు, మెటీరియల్ కంపోనెంట్ తదితర అంశాల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 14, 2026

కడియం కావ్య వినతికి కేంద్రం స్పందన

image

తెలంగాణలో ధాన్యం, పత్తి రవాణాకు అవసరమైన రైల్వే రేక్స్ కేటాయించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య చేసిన వినతికి కేంద్రం స్పందించింది. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావనీత్ సింగ్ బిట్టు లేఖ ద్వారా రేక్స్ సమృద్ధిగా కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్ర అవసరాలు, బోగీల లభ్యత ఆధారంగా ధాన్యం రవాణా కొనసాగుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో సుమారు 3.59 మిలియన్ టన్నుల ధాన్యం రైల్వే ద్వారా రవాణా కానుందన్నారు.

News March 14, 2026

HYD: ఓల్డ్ సిటీ ఇక ‘హైటెక్’ గుమ్మం!

image

ట్రాఫిక్ సమస్యతో విసిగిపోయిన టోలిచౌకీ వాసులకు త్వరలో కొత్త అనుభూతి పలకరించనుంది. టూంబ్స్ నుంచి బంజారా దర్వాజా వరకు రోడ్డు మధ్యలో పచ్చని మీడియన్లు, ఫ్లైఓవర్ కింద అందమైన జంక్షన్లతో ఈ ప్రాంతం సరికొత్తగా ముస్తాబవుతోంది. సుమారు రూ.3.05 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనులు ప్రయాణికులకు కంటికి ఇంపుగా, మనసుకు హాయినివ్వనున్నాయి. భాగ్యనగర వైభవం మీ గుమ్మం ముందుకు రాబోతోంది.

News March 14, 2026

10 బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించిన నార్త్ కొరియా

image

నార్త్ కొరియా దాదాపు 10 బాలిస్టిక్ మిస్సైల్స్‌ను జపాన్ సముద్రం వైపు ప్రయోగించినట్లు సౌత్ కొరియా వెల్లడించింది. వీటి కెపాసిటీ, రేంజ్‌ను గుర్తించడం సాధ్యం కాలేదని తెలిపింది. జాయింట్ మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్న అమెరికా-సౌత్ కొరియాకు హెచ్చరికగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అణ్వాయుధ సామర్థ్యమున్న నార్త్ కొరియా మిస్సైల్స్ ప్రయోగం కలకలం రేపుతోంది.