News March 7, 2025
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి రేపు మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. తన సతీమణితో పాటు ఖుష్బూ, రాధిక, సుహాసిని, జయసుధ, మీనాలతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
Similar News
News July 5, 2025
సూపర్‌యునైటెడ్ ర్యాపిడ్ టైటిల్ నెగ్గిన గుకేశ్

గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా క్రోయేషియాలో జరుగుతున్న సూపర్‌యునైటెడ్ ర్యాపిడ్&బ్లిట్జ్ టోర్నీలో వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ర్యాపిడ్ టైటిల్ నెగ్గారు. ఫైనల్ రౌండ్లో USకు చెందిన వెస్లేపై విజయం సాధించారు. నిన్న ఐదో రౌండ్లో వరల్డ్ No.1 కార్ల్‌సన్‌ను ఓడించిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ్టి నుంచి బ్లిట్జ్ ఫార్మాట్ మొదలవనుంది. ర్యాపిడ్, బ్లిట్జ్ 2 ఫార్మాట్లలో ప్రదర్శన ఆధారంగా ఓవరాల్ విన్నర్‌ను ప్రకటిస్తారు.
News July 5, 2025
డీఎస్సీ నియామక ఉత్తర్వులపై ఆదేశాలు

AP: ఆగస్టు నాటికి డీఎస్సీ నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో ఆయన సమీక్షించారు. డిగ్రీ విద్యార్థులపై భారం తగ్గేలా UGC నిబంధనలకు అనుగుణంగా సబ్జెక్టుల ఎంపిక ఉండేలా చూడాలని సూచించారు. 2024-25కి సంబంధించి ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.
News July 5, 2025
జులై 5: చరిత్రలో ఈరోజు

1906: నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య జననం
1927: రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ జననం
1980: సినీ నటుడు కళ్యాణ్‌రామ్ జననం(ఫొటోలో)
1995: బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జననం(ఫొటోలో)
2017: సంఘసేవకురాలు కంచర్ల సుగుణమణి మరణం
అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం