News March 7, 2025

శనివారం విద్యాసంస్థలకు సెలవు: నెల్లూరు DEO

image

నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు శనివారం సెలవు దినంగా ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు తెలిపారు. శుక్రవారం రాత్రి జిల్లా శాఖ అధికారి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తొలుత శనివారం వర్కింగ్ డేగా తొలుత ప్రకటించారు. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా వారి మనోభావాలను గౌరవించి సెలవు దినంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 16, 2025

నెల్లూరు నగరపాలక సంస్థలో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు

image

నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇన్‌ఛార్జ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ శివకుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కమిషనర్ నందన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని కనకమహాల్ సెంటర్లో మూడంతస్తుల భారీ భవంతి నిర్మిస్తున్నారు. దానికి ఎలాంటి అనుమతులు లేవు. వ్యవహారాన్ని మేయర్ స్రవంతి ఇటీవల బయటపెట్టడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.

News September 16, 2025

నెల్లూరు: డీఎస్సీలో 16 మిగులు సీట్లు

image

నెల్లూరు జిల్లా నుంచి డీఎస్సీ-2025లో ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 673 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 657 మంది ఎంపికయ్యారు. 16 మిగులు సీట్లు ఉన్నాయి. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.

News September 16, 2025

నెల్లూరు జిల్లాలో ముగ్గురు మహిళా ఆఫీసర్లు

image

రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లా ఎస్పీగా అజిత వేజెండ్లని నియమించింది. పోలీసు శాఖలో ముగ్గురు మహిళలు ఉన్నత స్థాయిలో ఉండడంతో జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు. అడిషనల్ ఎస్పీగా సౌజన్య ఉండగా.. టౌన్ డీఎస్పీగా సింధుప్రియా ఉన్నారు. అత్యంత సవాళ్లతో కూడుకున్న పోలీస్ శాఖలో మహిళా”మణు”లు బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.