News March 7, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు..!

∆} సత్తుపల్లి:సొంతింటి కల కాంగ్రెస్తోనే సాధ్యం: ఎమ్మెల్యే రాగమయి∆}తెలంగాణ చిన్న తిరుపతి దేవస్థానంలో మంత్రి తుమ్మల, ఎంపీ∆} వైరా:రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే సోదరుడు మృతి ∆} సత్తుపల్లిలో ఏన్కూరు వాసులకి రోడ్డు ప్రమాదం∆} సీఎం పేరు మర్చిపోయిన వైరా ఎమ్మెల్యే ∆} కూసుమంచి :భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి ∆} ఖమ్మం: ఇనుప రైలింగ్ తొలగించిన పుర అధికారులు
Similar News
News March 7, 2026
విద్యాశాఖలో ఖమ్మం జిల్లా నంబర్ 1: కలెక్టర్

విద్యాశాఖ పనితీరులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో జిల్లా సాధించిన ఈ ఘనత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో రాబోయే పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
News March 7, 2026
ఖమ్మంలో న్యాయవాదులకు 40 గంటల మీడియేషన్ శిక్షణ

ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో శనివారం న్యాయవాదులకు 40 గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద, జస్టిస్ కె.శరత్ ప్రారంభించారు. కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం కీలకమని వారు పేర్కొన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో స్నేహపూర్వకంగా వివాదాలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రాజగోపాల్ తదితరులున్నారు.
News March 7, 2026
అంధ విద్యార్థిని కృతజ్ఞతలు.. ఖమ్మం కలెక్టర్ భావోద్వేగం

ఖమ్మం జడ్పీ సెంటర్‌లోని నిజాంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న అంధుల ప్రత్యేక పాఠశాలను శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి, అధికారులను పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ చదువుతున్న విద్యార్థిని భవాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయగా కలెక్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆ చిన్నారిని ఆశీర్వదించి చదువులో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.


