News March 7, 2025
HYD: BRS లీడర్ ఇంట్లో విషాదం!

HYD శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాలు.. HYD శివారులోని గొల్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్‌పై లారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కనిష్క్(20) మలక్‌పేట యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కనిష్క్ మూసారాంబాగ్ BRS మాజీ కార్పొరేటర్ తీగల సునరిత, అజిత్ రెడ్డి కుమారుడు. తీగల కృష్ణారెడ్డి బంధువులు అని సమాచారం.
Similar News
News March 5, 2026
మంచిర్యాల: ఈ అబ్బాయి కనిపిస్తే పోలీసులకు చెప్పండి

చెన్నూర్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పెద్దపోలు నాగవర్దన్ బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. మహంకాళివాడకు చెందిన ఈ విద్యార్థి మిస్సింగ్ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల పరిసరాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు.
News March 5, 2026
ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 436 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 436 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 10,742 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 10,305 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
News March 5, 2026
MDK: మహాత్ముడి విగ్రహాలకు అవమానం!

ఇటీవల మహాత్ముడి విగ్రహాలను అవమాన పరిచే సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం రాత్రి మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద గాంధీ విగ్రహానికి పేడ పూయడంతో పాటు కన్ను ధ్వంసం చేశారు. అలాగే తూఫ్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని తాతపాపాన్ పల్లీలో గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గతంలో మిరుదొడ్డి మండలంలోని ఓ గ్రామంలో కూడా గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. దుండగులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


