News March 8, 2025
VJA: మహిళా దినోత్సవ వారోత్సవ వేడుకల్లో హోం మంత్రి

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మహిళా దినోత్సవ వారోత్సవ వేడుకల్లో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక మంది మేధావులు, ప్రముఖుల ఆధ్వర్యంలో “మహిళల నాయకత్వం-సవాళ్లు పురోగమించే మార్గం” అన్న అంశంపై ప్యానెల్ డిస్కషన్‌లో భాగస్వామ్యమయ్యారు. మహిళల అభ్యున్నతితో పాటు వారిలోని నాయకత్వ సామర్ధ్యాలను వెలికి తీయడం, వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
Similar News
News April 15, 2026
NZB: పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన వర్సిటీ ఉపకులపతి

తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల 8వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి. యాదగిరి రావు పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ టి. సంపత్‌తో కలిసి కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు, ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.
News April 15, 2026
నేడు నిజామాబాద్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ రాక

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం మంత్రి నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2:45 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేటకు తిరుగు పయనవుతారు.
News April 15, 2026
ప్రకాశం: ప్రభుత్వ కాలేజీ విద్యార్థికి జిల్లా ఫస్ట్

ఇంటర్మీడియట్ ఫలితాల్లో S.కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా సెకండ్ ఇయర్ MPC విభాగంలో కత్తి కిరణ్ 975/1000 మార్కులు సాధించి ప్రకాశం జిల్లా అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు. ఫస్ట్ ఇయర్ MPC-389, BiPC-411, CEC-459, HEC-441, 2nd ఇయర్‌లో BiPC-898, CEC-891, HEC-669 టాప్ మార్క్స్ సాధించినట్లు చెప్పారు.


