News March 8, 2025
MBNR: ప్రతిభ కనబరిచిన మహిళలను అభినందించిన కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన మహిళలను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఘనంగా సత్కరించి వారికి బహుమతులు అందజేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మహిళల్ని సన్మానించి అభినందించారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 19, 2026
MBNR: రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా MLA యెన్నం శ్రీనివాసరెడ్డి

మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా శాసనసభలో నియమిస్తూ.. గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంతో ఆయనకు పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలలో మరింత కీలక బాధ్యతలు అప్పగించినట్లు భావిస్తున్నారు. MLA కొంతకాలంగా పార్టీకి విశేష సేవలు అందిస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొన్నారు. పనితీరును గుర్తించి ప్రభుత్వం విఫ్‌గా నియమించింది.
News March 19, 2026
MBNR: ఉగాది వేళ మన్యంకొండకు భక్తుల రద్దీ

నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, దర్శనం సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు.
News March 19, 2026
MBNR: ఉగాది, రంజాన్ EFFECT.. రద్దీ

ఉగాది, రంజాన్ పండుగలతో వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ వైపు వచ్చే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. గురువారం ఉగాది, శనివారం రంజాన్ కావడంతో మధ్యలో శుక్రవారం సెలవు తీసుకుని ఊర్లకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏర్పడింది.


