News March 8, 2025
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 100% డెలివరీలు చేయాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రులలో 100% డెలివరీలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జన ఔషది దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లాలోని వైద్యాధికారులతో, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న వేసవి దృష్టా ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, జైపాల్ తదితరులున్నారు.
Similar News
News March 15, 2026
జనగణన వివరాలు చెప్పకుంటే రూ.1000 ఫైన్

తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు తొలిదశ జనగణన జరగనుందని సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరి తెలిపారు. సర్వేలో 33 రకాల ప్రశ్నలుంటాయని, వివరాలు చెప్పకుంటే రూ.1000 ఫైన్ విధిస్తామని వెల్లడించారు. జనగణన ఆధారంగానే ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలను అమలు చేస్తాయని, ప్రజలు ఎన్యుమరేటర్లకు పూర్తిగా సహకరించి డీటెయిల్స్ ఇవ్వాలని కోరారు. రెండో దశ సెన్సస్ 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు కొనసాగుతుందని చెప్పారు.
News March 15, 2026
హార్ముజ్‌కు యుద్ధ నౌకలు పంపండి: ట్రంప్

హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు US అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ వల్ల ఇబ్బందులు పడుతున్న దేశాలు అమెరికాతో కలిసి యుద్ధ నౌకలను హార్ముజ్‌కు పంపాలని తాజాగా కోరారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, ద.కొరియా, UK తదితర దేశాలు ప్రభావితమయ్యాయని, అవి తమ వార్‌షిప్స్‌ను పంపిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా వందలాది సరకు రవాణా నౌకలు హార్ముజ్‌లో నిలిచిపోవడంతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది.
News March 15, 2026
NZB: హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

నిజామాబాద్ జిల్లాలోని 340 మంది హజ్ యాత్రికులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ తెలిపారు. శనివారం జీజీహెచ్‌లో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. అనంతరం ఈ నెల 23న యాత్రికులకు ముందుజాగ్రత్తగా ఇన్ఫ్లుఎంజా, న్యూమోకొకల్ వంటి టీకాలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు.


