News March 8, 2025
జనగామ: వికసిత భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ల ఆవిష్కరణ

వికసిత భారత్ యూత్ పార్లమెంట్‌కు సంబంధించిన వాల్ పోస్టర్లను జనగామ జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్ శుక్రవారం ఆయన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో జనగామ ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు అనగాని శ్రీనివాస్, నవీనరాణి, శ్రీదేవి పాల్గొన్నారు.
Similar News
News April 1, 2026
‘ఆయా షేర్’.. నాని ఊర మాస్ లుక్!

నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా ‘ప్యారడైజ్’ కోసం చేసిన మేకోవర్ నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ చిత్రం కోసం ఆయన కండలు తిరిగేలా బాడీని బిల్డ్ చేశారు. తాజాగా జిమ్‌లో కసరత్తు సందర్భంగా దిగిన ఫొటోను ఆయన షేర్ చేయగా వైరలవుతోంది. నాని మాస్ లుక్ చూసి అభిమానులు ‘ఆయా షేర్’ అని పేర్కొంటూ ఆయన డెడికేషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్యారడైజ్ మూవీ ఆగస్టు 21న విడుదలవనుంది.
News April 1, 2026
ఆ దుకాణాలను సీజ్ చేయండి: నంద్యాల కలెక్టర్

పాణ్యం మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ రాజకుమారి గణియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ సేవలు, ప్రజలకు అందుతున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ను చూసి డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలు వదిలి వెళ్లడంతో, వాటిని సీజ్ చేయించాలని ఆమె ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
News April 1, 2026
విద్యుత్ సిబ్బంది భద్రత పరికరాలు ధరించాలి: ఎస్ఈ

క్షేత్రస్థాయిలో విద్యుత్ పనులు నిర్వహించే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా భద్రతా పరికరాలు ధరించి పని చేయాలని ఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్ఈ గౌతమ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్, హ్యాండ్ గ్లౌజ్, ఎర్త్ రాడ్ వంటి భద్రతా పరికరాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు చేయరాదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


