News March 8, 2025
మెదక్: సాగు నీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షించాలి: కలెక్టర్

మెదక్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా వ్యవసాయ అధికారులతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి వినయ్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాగునీటి వినియోగంపై కలెక్టర్ సమీక్షించారు. వ్యవసాయ అధికారులు కాలువలను సందర్శించి నీరు వృథా కాకుండా చూడాలని సూచించారు.
Similar News
News March 12, 2026
మెదక్: ఇంటర్ పరీక్షలకు 96.71 % హాజరు

మెదక్ జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 6085 మందికి గాను 5895 మంది, ఒకేషనల్ విభాగంలో 279 మందికి గాను 260 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 96.71% హాజరు నమోదైంది. నేటితో మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.
News March 11, 2026
మహిళలు ఆర్థిక అంశాలపై పట్టు సాధించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్ కలెక్టరేట్‌లో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక అంశాలపై పట్టు సాధించి స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. మహిళల హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
News March 11, 2026
MDK: నాగ్సాన్‌పల్లి శివారులో మహిళ హత్య..?

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి శివారులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలిలా.. కొడుపాక గ్రామానికి చెందిన బ్యాగరి సులోచన(35) సోమవారం కూలీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం చెలిమకుంట వద్ద ఆమె మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ముఖంపై కర్రతో దాడి చేసిన గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు.


