News March 8, 2025

పాడేరు: బయో టాయిలెట్లను ప్రారంభించిన కలెక్టర్

image

కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద కోల్‌కతాకు చెందిన ఓ సంస్థ పాడేరు తలారిసింగి గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాలలో రెండు బయో టాయిలెట్లను నిర్మించారని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. విశాఖకు చెందిన మంత్రి సత్యనారాయణ చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ బయో టాయిలెట్లను శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. కార్పోరేట్ సంస్థలు సామాజిక బాధ్యత కింద గిరిజనులకు మేలు చేయడం గొప్ప విషయం అన్నారు.

Similar News

News March 5, 2026

సౌతాఫ్రికాకు హార్ట్ బ్రేక్!

image

ప్రపంచకప్ గెలవాలనుకున్న సౌతాఫ్రికాకు మరోసారి నిరాశే మిగిలింది. T20 WC-2026లో సెమీస్‌లో బోల్తా పడింది. ఈ ఎడిషన్‌లో ఓటమి అనేదే లేకుండా దూసుకొచ్చిన SA ఆశలపై న్యూజిలాండ్ <<19299856>>నీళ్లు చల్లింది<<>>. 2024 ఫైనల్‌లోనూ చివరి దాకా పోరాడి ఇండియా చేతిలో SA ఓడిపోయింది. గతేడాది మహిళల జట్టు ODI WC ఫైనల్‌లో భారత్ చేతిలోనే పరాజయం పాలైంది. తాజా ఓటమితో సౌతాఫ్రికాకు హార్ట్ బ్రేక్ తప్పలేదు. better luck next time.

News March 4, 2026

యూరియా ఉత్పత్తి తగ్గుదల.. పెరగనున్న రేట్లు?

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం కారణంగా ఖతర్‌లో LNG <<19281702>>ఉత్పత్తి<<>> నిలిచిపోవడంతో ఇండియాలో యూరియా ప్రొడక్షన్‌‌ను కంపెనీలు తగ్గిస్తున్నాయి. యూరియా ఉత్పత్తికి LNG ప్రైమరీ ఫీడ్‌స్టాక్. ఇది ఎనర్జీ సోర్స్‌గానే కాకుండా ఎరువుల తయారీ ప్రక్రియలోనూ కీలకమైన ఇన్‌పుట్. యూరియా కొరత ఏర్పడితే రేట్లు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని ఎరువుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

News March 4, 2026

BNGR: హాస్టళ్లలో ఇక ‘ఫేషియల్’ హాజరు..! .

image

జిల్లాలోని 85 సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇకపై Facial Recognition (FRS) ద్వారా హాజరు నమోదు చేయనున్నారు. SC, ST, BC, మైనార్టీ, కేజీబీవీల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయమని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకా రెడ్డి పాల్గొన్నారు.