News March 8, 2025
శుభ ముహూర్తం (08-03-2025)

☛ తిథి: శుక్ల నవమి, మ.12.01 వరకు
☛ నక్షత్రం: ఆరుద్ర, తె.2.35 వరకు
☛ శుభ సమయం: ఆరుద్ర శివ పూజలకు మంచిది
☛ రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
☛ యమగండం: మ.1.30 నుంచి 3.00 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.6.00-నుంచి 7.36 వరకు
☛ వర్జ్యం: ఉ.11.27 నుంచి 1.00 వరకు
☛ అమృత ఘడియలు: సా.4.53 గంటల నుంచి 6.25 వరకు
Similar News
News March 26, 2026
రోజూ కాసేపు హాయిగా నవ్వితే..

నవ్వు బెస్ట్ మెడిసిన్ అంటున్నారు వైద్యులు. రోజూ కాసేపు మనస్ఫూర్తిగా నవ్వితే ఫిజికల్, మెంటల్ టెన్షన్లు, ఒత్తిడి, కోపం తగ్గుతాయంటున్నారు. ‘10-15ని.లు నవ్వితే 40 క్యాలరీలు ఖర్చవుతాయి. ఫీల్ గుడ్ హార్మోన్లయిన ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. రోగనిరోధక శక్తి, రక్త నాళాల పనితీరు మెరుగుపడుతుంది. గుండె సమస్యలు, BP తగ్గుతాయి. క్యాన్సర్‌పై పోరాటంలోనూ సాయపడుతుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt
News March 26, 2026
BREAKING: పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,46,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.1,34,650 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షలుగా ఉంది.
News March 26, 2026
బంకుల్లో ‘నో స్టాక్’కు కారణాలివే..

బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులకు కారణం ఇంధన కొరత కాదు. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావడంతో పాత బాకీలు చెల్లిస్తేనే కొత్త స్టాక్ ఇస్తామని కంపెనీలు కండిషన్ పెడుతుంటాయి. ఈ నగదు సర్దుబాటు చేయలేక డీలర్లు ఆర్డర్లు ఆపేశారు. దీనికి తోడు పెట్రోల్ అయిపోతుందనే భయంతో జనం ‘పానిక్ బయింగ్’ చేస్తూ ట్యాంకులు ఫుల్ చేయిస్తుండటంతో 2 రోజుల స్టాక్ ఒక్కరోజులోనే ఖాళీ అవుతోంది. సంస్థల వద్ద మాత్రం నిల్వలకు ఎలాంటి ఇబ్బందీ లేదు.


