News March 23, 2024
SOMIREDDY: వరుసగా 5 సార్లు ఓడినా మళ్లీ టికెట్
AP: మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా 5 సార్లు ఓడినా మళ్లీ టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆయనకు ఆరోసారి టికెట్ కేటాయిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సర్వేపల్లి నుంచి ఆయన 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమిపాలయ్యారు. 2012లో కోవూరు ఉపఎన్నికలో కూడా ఓడిపోయారు. సోమిరెడ్డి గెలుపు రుచి చూడక రెండు దశాబ్దాలు గడిచినా ఆరోసారి టికెట్ సాధించుకున్నారు.
Similar News
News January 9, 2025
సోషల్ మీడియాలో మరో హీరోయిన్‌కు వేధింపులు
సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతోపాటు తన కుటుంబాన్ని కూడా అంతమొందిస్తానని అతడు హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్యా బెదిరింపుల వల్ల తాను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు ఆమె వాపోయారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల హీరోయిన్ హనీ రోజ్‌ను కూడా ఓ వ్యాపారవేత్త వేధించిన విషయం తెలిసిందే.
News January 9, 2025
బిగ్‌బాస్ 18కు చాహల్, శ్రేయస్ అయ్యర్?
బిగ్ బాస్ 18లో టీమ్ ఇండియా క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, శ్రేయస్ అయ్యర్‌తోపాటు శశాంక్ సింగ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సండే ఈవెంట్‌లో వీరు సందడి చేస్తారని సమాచారం. వీరు ముగ్గురూ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ధనశ్రీ, చాహల్ విడాకులకు శ్రేయస్ అయ్యర్ కారణమంటూ కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఆసక్తిగా మారింది.
News January 9, 2025
బకరాను వదిలి పెద్ద పులులను పట్టుకోండి: బీవీ రాఘవులు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బకరా చేస్తున్నారని CPM పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. బకరాను వదిలి పెద్ద పులులను పట్టుకోవాలన్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. పీఎం మోదీ విశాఖకు వస్తే పోలీసులంతా అక్కడే మోహరించారని, 10 లక్షల మంది భక్తుల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. ఘటనపై సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కూడా సమాధానం చెప్పాలన్నారు.