News March 8, 2025
అన్ని రంగాలలో రాణిస్తున్న మహిళలు: అన్నమయ్య ఎస్పీ

మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం అంగళ్లు సమీపంలోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాసాగర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు, నాదెళ్ల ద్వారకనాథ్, ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్, డాక్టర్ షణ్ముఖ ప్రియా తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 15, 2025
పొన్నూరు: చిన్నారి ప్రాణం తీసిన వీధి కుక్కలు

పొన్నూరు మండలం వెల్లలూరులో విషాదం చోటుచేసుకుంది. తాడిశెట్టి కార్తీక్(5) గత నెల 22న ఇంటి వద్ద ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం గుంటూరు, విజయవాడ ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స అందించినా సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News September 15, 2025
అన్నమయ్య జిల్లాలో బాలికపై లైంగిక దాడి

అన్నమయ్య జిల్లాలో సోమవారం అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తంబళ్లపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికపై అదే ఊరికి చెందిన 12ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తంబళ్లపల్లె SI ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
News September 15, 2025
ANU: పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలు విడుదల

ANUలో పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను సోమవారం పరీక్షల నియంత్రణాధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. జులైలో జరిగిన ఎం.ఎస్సీ స్టాటిస్టిక్స్, ఎం.ఎస్సీ బయోకెమిస్ట్రీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రీవాల్యుయేషన్‌కు ఆసక్తిగల విద్యార్థులు ఒక్కో పరీక్షకు రూ.1,860 చొప్పున ఈ నెల 24వ తేదీలోపు చెల్లించాలని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన తెలిపారు.