News March 23, 2024

ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి హామీ పథకం

image

AP: ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి హామీ చట్టం వర్తింపజేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం హిజ్రాలకు కూడా ఉపాధి హామీ వర్తింంపజేయాలని భావించింది. దీంతో వెంటనే కేంద్రానికి విన్నవించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్‌ను ఒక కుటుంబంగా గుర్తించి జాబ్ కార్డు ఇవ్వనున్నారు. ఐదుగురు హిజ్రాలు ఉంటే వారిని ప్రత్యేక గ్రూపుగా పరిగణించనున్నారు. పని స్థలంలో వారిని ఎవరూ వెకిలిగా కించపరచకూడదు.

Similar News

News April 18, 2026

GOOD NEWS: ఇంటర్ సెకండియర్‌కూ ఇంప్రూవ్‌మెంట్

image

AP: ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు బోర్డ్ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నుంచి ఫెయిల్, పాసైన విద్యార్థులు సైతం ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చని ప్రకటించింది. ఏ సబ్జెక్టులో మార్కులు తగ్గితే ఆ సబ్జెక్ట్ రాయొచ్చని, ప్రతి పేపర్‌లో ఎక్కువ వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటామంది. దీనివల్ల మంచి కాలేజీల్లో సీటు రాకపోవడం, ఒత్తిడికి లోనవడం లాంటివి తగ్గే అవకాశం ఉందని బోర్డు తెలిపింది.

News April 18, 2026

చెన్నైకి ఆరెంజ్ ఆర్మీ షాకిస్తుందా?

image

ఐపీఎల్‌లో CSKపై SRH రికార్డు పేలవంగా ఉంది. ఇరు జట్లు 22 సార్లు తలపడగా ఆరెంజ్ ఆర్మీ 7, చెన్నై 15 సార్లు గెలిచాయి. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో అత్యధిక స్కోర్ రికార్డు సీఎస్కే పేరిట (223/3) ఉంది. SRH 2024లో అత్యధికంగా 192 రన్స్ చేసింది. ఉప్పల్ స్టేడియంలో 2018 నుంచి చెన్నై గెలవలేదు. ఈసారి CSKతో పోలిస్తే సన్‌రైజర్స్ బలంగా కనిపిస్తోంది. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News April 18, 2026

రైతుభరోసా రెండో విడత.. ఎల్లుండి ఖాతాల్లోకి డబ్బులు

image

TG: రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులు విడుదల చేయనున్నారు. రెండో విడతలో 1-5 ఎకరాల్లోపు భూమి ఉన్న 45.11 లక్షల మంది రైతులకు రూ.5,653 కోట్లు జమ అవుతాయని వ్యవసాయశాఖ తెలిపింది. కాగా గత నెల 23న తొలి విడత కింద ఎకరం లోపు ఉన్న 68 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లు జమ చేసింది.