News March 8, 2025
జనగామ: విషాదం.. ఆశా కార్యకర్త మృతి

జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం నిడిగొండలోని ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేస్తున్న ఆశా కార్యకర్త చీటకోడూర్ మహేశ్వరి హార్ట్ స్ట్రోక్‌తో శుక్రవారం మృతిచెందారని స్థానికులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వృత్తిపరంగా గ్రామంలోని ప్రజలందరి మన్ననలు పొందిన ఆమె మృతిపై గ్రామస్థులు బాధాతప్త హృదయంతో నివాళులర్పించారు.
Similar News
News March 31, 2026
మారేడుమిల్లి: ‘ఏకలవ్య పరీక్షలకు గంట ముందే చేరుకోవాలి’

పోలవరం జిల్లాలో ఏప్రిల్ 4న ఏకలవ్య విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశానికి పరీక్ష జరుగుతుందని జిల్లా పరీక్షల కన్వీనర్ శంకర్ ప్రసాద్ మంగళవారం తెలిపారు. జిల్లాలో 7 పరీక్ష కేంద్రాల్లో 1,445 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారని తెలిపారు. 100 మార్కులకు పరీక్ష జరుగుతుందని, ఉదయం 11.40కు ప్రారంభం అవుతుందన్నారు. ఒక గంట ముందుగా పరీక్ష కేంద్రానికి రావాలని సూచించారు.
News March 31, 2026
పెళ్లికి ముందు ఈ టెస్టులు చేయించుకోండి!

పెళ్లికి జాతకాలతో పాటు మెడికల్ టెస్టులు చేయించుకోవడం కూడా ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ‘బ్లడ్ గ్రూప్, హిమోగ్లోబిన్ స్థాయులు, HIV, హెపటైటిస్-B &C, VDRL, రుబెల్లా వంటి పరీక్షలు కాబోయే జంటలు చేయించుకోవాలి. ఇవి దంపతుల ఆరోగ్యానికే కాకుండా, పుట్టబోయే బిడ్డలకు జన్యుపరమైన లోపాలు, ప్రాణాంతక వ్యాధులు రాకుండా రక్షణనిస్తాయి’ అని చెబుతున్నారు. SHARE IT
News March 31, 2026
హైదరాబాద్: RRR వెంబడి ‘డార్క్ జోన్’!

RRR వెంబడి భూములున్న రైతులకు షాక్ ఇచ్చేలా GOVT రహస్య GO రెడీ చేసిందని అంతర్గత సమాచారం. రోడ్డుకు ఇరువైపులా 2KM మేర బఫర్ జోన్‌గా ప్రకటించి PVT వెంచర్లకు పర్మిషన్లు నిలిపివేయబోతున్నారు. ఈ భూమిని భవిష్యత్తులో GOVT అవసరాల కోసం సేకరించాలని ప్లాన్. రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుందనే భయంతో ఈ విషయాన్ని బయటపెట్టలేదు. సామాన్యుడు భూమిని అమ్ముకోలేని, కొనుక్కోలేని పరిస్థితి వస్తుందేమోనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


