News March 8, 2025
కేసముద్రం: రైలు కిందపడి వ్యక్తి మృతి

కేసముద్రం – ఇంటికన్నె రైల్వే స్టేషన్ మధ్య ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. మృతి చెందిన వ్యక్తికి 35-40 సంవత్సరాల వయసు ఉంటుందని వరంగల్ జీఆర్పీ పోలీసులు తెలిపారు. వ్యక్తి గుర్తులు బ్లూ కలర్ ప్యాంటు, పసుపు రంగు టీ షర్టు ధరించి, ఛాతిపై వీటీ అనే అక్షరాలు పచ్చబొట్టు ఉన్నట్లు పేర్కొన్నారు. అతడి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు.
Similar News
News November 22, 2025
WGL: జైలు భూమి తాకట్టు.. రుణం మళ్లింపుపై విజిలెన్స్ కసరత్తు

WGL సెంట్రల్ జైలు భూమిని తాకట్టు పెట్టి TG SSHCL రూ.117 కోట్ల రుణం తీసుకున్నా, అది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి కాకుండా ఇతర ఖర్చులకు మళ్లించినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. జీవో 31తో బదిలీ చేసిన 56 ఎకరాల భూమి తాకట్టు విధానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుబట్టి విచారణకు ఆదేశించారు. ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయ్యగా, విజిలెన్స్ నివేదిక అందిన వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోనున్నారు.
News November 22, 2025
WGL: మార్చిలోపు ఆస్పత్రి పూర్తికి లక్ష్యం!

WGL సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మార్చిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ప్రభుత్వం పెంచిన రూ.1,725.95 కోట్ల అంచనా వ్యయాన్ని ఆడిట్ తర్వాత రూ.1,558 కోట్లకు తగ్గించారు. సివిల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, పారిశుధ్య పనులకు రూ.1,158 కోట్లు కేటాయించగా, మొత్తం 85% పనులు పూర్తయ్యాయి. ఎక్విప్మెంట్ ఇన్‌స్టాలేషన్ జరుగుతోంది. నిధుల సమస్య లేకుండా మార్చిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు?
News November 22, 2025
కృష్ణా: చోరీ అనుమానితుల ఫొటోలు విడుదల..!

మచిలీపట్నం మాచవరం సమీపంలోని పాత తౌడు ఫ్యాక్టరీ వద్ద రెండు రోజుల కిందట రెండు ఇళ్లలోకి చోరీకి పాల్పడిన నిందితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. వీరు ఎక్కడ కనిపించినా వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ 8332983789కు సమాచారం ఇవ్వాలని చిలకలపూడి సీఐ కోరారు. వీరిద్దరూ బైక్‌పై తిరుగుతుంటారని తెలిపారు.


