News March 8, 2025

మహబూబాబాద్: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మట్టేవాడ గ్రామానికి చెందిన పూనెం వీరస్వామి(45) అనే వ్యక్తి జీవితంపై విరక్తి చెంది తన ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడని స్థానికులు తెలిపారు. వెంటనే కుటుంబీకులు గమనించి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Similar News

News January 16, 2026

సదర్ మట్ బ్యారేజ్‌ను ప్రారంభించిన సీఎం

image

మామడ మండలం పొన్కల్ గ్రామంలోని గోదావరి నదిపై రూ.576 కోట్లతో నిర్మించిన సదర్ మట్ బ్యారేజ్‌ను శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బ్యారేజ్‌కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిమోట్ ద్వారా గేట్లను ఓపెన్ చేశారు.

News January 16, 2026

ఫోర్త్ సిటీలో ఎగిరే టాక్సీలు.. స్కైరైడ్ సిద్ధం!

image

HYDకు ఎగిరే టాక్సీలు రానున్నాయి. ఫోర్త్ సిటీలో ఈ ‘వర్టిపోర్ట్స్’ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విమానాలకు రన్-వే కావాలి. కానీ ఈ ఎయిర్ టాక్సీలు (eVTOL) హెలికాప్టర్ లాగా నిలువుగాపైకి లేస్తాయి, కిందకు దిగుతాయి. అందుకే వీటికి ఎయిర్‌పోర్ట్ అవసరం లేదు. ఇవి హై స్పీడ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ హబ్‌లు కూడా. యాప్‌లో బుక్ చేస్తే ఇంటి మీద ఆగుతాయి. ఫోర్త్ సిటీనుంచి 10MINలో సైలెంట్‌గా ఎయిర్‌పోర్టుకు వెళ్లొచ్చు.