News March 8, 2025
మహబూబాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రజలకు ఒక శుభవార్త. పట్టణ కేంద్రంలో గత నెల రోజులుగా కొనసాగుతున్న రైల్వే మూడో లైన్ మరమ్మతుల నిమిత్తం RUB582B అండర్ బ్రిడ్జ్‌ను మూసివేసిన విషయం తెలిసింది. తాజాగా మరమ్మతులు పూర్తయ్యాయని, ఈనెల 11వ తేదీన అండర్ బ్రిడ్జ్ రీ ఓపెన్ చేస్తున్నట్లుగా రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని ప్రజలు భావిస్తున్నారు.
Similar News
News November 4, 2025
అనకాపల్లి: ‘అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

ఏపీ ఎంఎస్ఎంఈడీసీ ఆధ్వర్యంలో ఈనెల 9, 10వ తేదీల్లో విశాఖలో ఎగుమతి సదస్సు జరుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ మంగళవారం తెలిపారు. ఈ సదస్సులో ఇంజినీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్, తదితర రంగాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారన్నారు. అవకాశాన్ని పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని కోరారు.
News November 4, 2025
KNR: టెక్నాలజీ హబ్‌కి శ్రీకారం చుట్టిన NRI

తను నిర్మించే నూతన గృహం యువతకు, ప్రజలకు ఉపయోగపడాలని వినూత్నంగా “రాజ గృహ” అనే పేరును నామకరణం చేసినట్లు NRI సరిగొమ్ముల హరిప్రసాద్ తెలిపారు. ఇల్లందకుంట మండలం బూజునూరులో తను నిర్మించే గృహంలో గౌతమ బుద్ధ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన శ్రీకారం చుట్టారు. తను అమెరికాలో ఉన్నప్పటికీ గ్రామాన్ని విద్యా, వైద్యం, వ్యవసాయ అభివృద్ధికై టెక్నాలజీ హబ్‌గా మారుస్తానని హరిప్రసాద్ పేర్కొన్నారు.
News November 4, 2025
అమరావతిలో 158 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్

రాష్ట్రంలో సాంకేతిక విప్లవానికి నాంది పలకడానికి అమరావతి క్వాంటమ్ వ్యాలీ సిద్ధమవుతోంది. ఇక్కడ 158 క్యూబిట్ల సామర్థ్యం గల అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయనున్నారు. దీనిని తాత్కాలికంగా VIT క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. జనవరి 2026 నాటికి అధికారికంగా అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్ అమరావతిని భవిష్యత్ సాంకేతిక కేంద్రంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుందని కూటమి నేతలు చెబుతున్నారు.


