News March 8, 2025
సిద్దిపేట: అక్క చెల్లెళ్లు అదుర్స్.. అంతా డాక్టర్స్

ఒక సామాన్య కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు MBBS చదువుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. వివరాలు.. సిద్దిపేటలోని నర్సాపూర్‌కు చెందిన కొంక రామచంద్రం (టైలరింగ్) శారద దంపతులకు నలుగురు కుమార్తెలు మమత, మాధురి, రోహిణి, రోషిణి ఉన్నారు. వారిలో పెద్ద కూతురు మమత 2018-24లో MBBS పూర్తి చేయగా ఆమె చెల్లెళ్లు అదే బాట పట్టారు. మాధురి ఫైనల్ ఇయర్, రోహిణి ఫస్ట్ ఇయర్ చదువుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Similar News
News October 16, 2025
జూబ్లీహిల్స్‌లో బై‘పోల్’ పరేషాన్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. ఇక్కడ ఓటు వేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇది ఈసారేకాదు నియోజకవర్గం కొత్తగా ఏర్పడినప్పటి నుంచీ జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో 56 శాతం, 2018లో 47.58 శాతం, 2023లో 45.59 శాతం పోలింగ్ జరిగింది. అంటే పదేళ్లలో దాదాపు 10 శాతం పడిపోయింది. మరి ఈసారి ఎంత శాతం నమోదవుతుందో చూడాలి.
News October 16, 2025
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికిన మహబూబ్‌నగర్ కలెక్టర్

మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో పూల మొక్కతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక పోలీసుల నుంచి రాష్ట్ర గవర్నర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
News October 16, 2025
అంగన్వాడీల్లో పోషణ బలోపేతం చేయండి: కలెక్టర్

మహిళా, శిశు అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ‘పోషణ మాసం’ ముగింపు కార్యక్రమం గురువారం ఐడీవోసీలో జరిగింది. KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..లోప పోషణ స్థాయిని తగ్గించడానికి, గర్భిణీలు/బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల్లో సరైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంతకు ముందు కలెక్టర్ అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన చిరుధాన్యాల పోషకాహార ప్రదర్శనను వీక్షించారు.