News March 8, 2025
వరంగల్‌ను శాసిస్తున్న మహిళా శక్తి

ఓరుగల్లును మరోసారి మహిళా శక్తి శాసిస్తోంది. ఒకప్పుడు రుద్రమదేవి పరిపాలనలో గొప్ప శోభను అందుకున్న వరంగల్ రాజ్యం, నేడు అనేక కీలక పదవుల్లో మహిళా నేతలతో మరో చరిత్ర సృష్టిస్తోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, వరంగల్ ప్రాంతాన్ని నడిపిస్తున్న మహిళా నేతల కృషిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కీలక హోదాల్లో మహిళా నేతలు ప్రభుత్వ పరిపాలన నుంచి రాజకీయాల వరకు భాగమవుతున్నారు. HAPPY WOMEN’S DAY.
Similar News
News November 5, 2025
జగిత్యాల: విచిత్ర ఘటన.. నెల రోజుల్లో ఏడుసార్లు కాటేసిన పాము

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగించే 28 ఏళ్ల యువకుడిని గత నెలలో పాము కాటు వేసింది. వెంటనే చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే మరోసారి కాటేయడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి రాగానే మళ్లీ కాటు వేసింది. ఇలా నెలరోజుల వ్యవధిలో ఒకే వ్యక్తికి ఏడుసార్లు పాము కాటు వేయడంతో పాము పగ పట్టినట్టు ఉందని కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు.
News November 5, 2025
గుంటూరు: ‘ప్రైవేట్ కాలేజీల నిర్లక్ష్యంపై చర్యలేవి’

రాజధాని అమరావతిలోని ప్రైవేట్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలలో నిల్వ ఉంచిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టడంతో విద్యార్థుల ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. రాజధానిలో ప్రైవేట్ కాలేజీల నిర్లక్ష్యంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
News November 5, 2025
OFFICIAL: కమల్ ప్రొడక్షన్‌లో రజినీ సినిమా

తమిళ సినీ దిగ్గజాలు రజినీకాంత్, కమల్ హాసన్ ఓ సినిమా కోసం చేతులు కలిపారు. కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో రజినీకాంత్ హీరోగా ఈ మూవీ తెరకెక్కనుంది. దీనికి సి.సుందర్ దర్శకత్వం వహించనున్నారు. సూపర్ స్టార్‌కు 173వ సినిమా ఇది. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు కమల్ హాసన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


