News March 8, 2025

ఈనెల 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ

image

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో జరిగిన సమావేశంలో కీలక ప్రకటన చేశారు. ఓరుగల్లు (వరంగల్)లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.

Similar News

News March 17, 2026

20 లక్షల ఉద్యోగాలే టార్గెట్: లోకేశ్

image

AP: పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు(APEDB) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఉద్యోగాల కల్పనే సింగిల్ అజెండాగా ఉండాలన్నారు. ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని ఆదేశించారు.

News March 17, 2026

ఏప్రిల్ 15 వరకు పశువులకు గాలికుంటు టీకాలు: జేసీ

image

2030 నాటికి గాలికుంటు వ్యాధిని పూర్తిగా నియంత్రించడమే లక్ష్యమని జేసీ నిశాంతి తెలిపారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్‌లో టీకా కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 15 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏడాదికి రెండుసార్లు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని పాడి రైతులకు సూచించారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం కింద ఈ టీకాలు వేయనున్నారు.

News March 17, 2026

వికారాబాద్‌లో వరుస సెలవులు!

image

వికారాబాద్‌లో ఒక్కపూట బడులు ప్రారంభం కావడంతో పాటు మార్చి నెలలో పండుగల సెలవులు కలిసొస్తున్నాయి. మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా వరుసగా సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగి, ఆ తర్వాత వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. మార్చిలోనే ఉగాది, రంజాన్ పండుగలు రావడంతో విద్యార్థులకు వరుస విరామం దొరకనుంది. దీంతో అటు పండుగలు, ఇటు పరీక్షల సన్నద్ధతలో విద్యార్థులు నిమగ్నమయ్యారు.