News March 8, 2025
సంగారెడ్డి: జిల్లా నూతన ఎస్పీ పారితోష్ పంకజ్ నేపథ్యం

సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నా పారితోష్ పంకజ్ 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓఎస్డీగా పని చేస్తున్నారు. ఈయన బీహార్‌లోని ఒక గ్రామంలో జన్మించిన పారితోష్ తన పాఠశాల విద్యను బీహార్ రాష్ట్రంలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన బీఎస్సీ నాటికల్ సైన్స్ చదివి UPSCకి సిద్ధం కావాలని నిర్ణయించుకుని UPSC పరీక్షలో 142 ర్యాంక్ సాధించారు.
Similar News
News July 7, 2025
విశాఖలో పేకాట స్థావరాలపై దాడులు

మధురవాడ పరిధి కొమ్మాది శివార్లలో పేకాట ఆడుతున్న ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుండి రూ.43 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని పీఎంపాలెం పోలీసులకు అప్పగించారు. అలాగే భీమిలి సమీపంలో ఓ రిసార్ట్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి రూ.2.51వేలు స్వాధీనం చేసుకున్నారు.
News July 7, 2025
సిరిసిల్ల: మహిళలు వేధింపులకు గురవుతున్నారా..?

వేధింపులు ఎదురైతే ఏం చేయాలి? ఎవరి సహాయం కోరాలి? ఇలా అయోమయంలో పడే మహిళలకు భరోసాగా మారుతోంది రాజన్నసిరిసిల్ల జిల్లాలోని షీ టీం. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈ బృందం నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళా చట్టాలు, రక్షణకోసం తీసుకుంటున్న చర్యలపై తెలియజేస్తోంది. వేధింపులు ఎదురైతే 8712656425కు ఫోన్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News July 7, 2025
కడుపులో పెన్నులు.. బయటకు తీసిన వైద్యులు

నరసరావుపేటకి చెందిన 28 ఏళ్ల యువతి కడుపులో ఉన్న నాలుగు పెన్నులను వైద్యుడు రామచంద్రారెడ్డి శస్త్ర చికిత్స చేసి వెలికి తీశారు. వాంతులతో వైద్యశాలకు చేరిన యువతకి సిటీ స్కాన్ చేయడం ద్వారా కడుపులో పెన్నులు ఉన్నట్లు గుర్తించారు. అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానంలో ఎటువంటి కోత, కుట్లు లేకుండా వైద్యులు ఈ అరుదైన శాస్త్ర చికిత్స చేశారు. భర్త మీద కోపంతో పెన్నులు మింగినట్లు వైద్యులు తెలిపారు.