News March 8, 2025

ములుగు: ‘2 నెలలుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదు’

image

ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద 2 నెలల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గ్రామ పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా కృషి చేయాలని కోరారు.

Similar News

News March 31, 2026

బాపట్ల: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

image

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన కర్లపాలెం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని ఎట్రా వారిపాలెం గ్రామ శివారులోని మురుగు కాలువ వద్ద లంక కాలువ కట్టకు చెందిన అద్దూరి వెంకట్రావు చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 31, 2026

జూపూడిలో గంజాయి విక్రయ స్థావరంపై దాడి

image

పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్చలతాడిపర్రు శివారు జూపూడి పొలాల్లో గంజాయి విక్రయం, వినియోగ స్థావరంపై పోలీసులు దాడి చేశారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పరారైనట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 1.250 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 5గ్రాముల ప్యాకెట్ రూ.500కి విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు.

News March 31, 2026

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: మెదక్ ఎస్పీ

image

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 1861లోని సెక్షన్ 30, 30(ఎ) అమల్లో ఉంటుందని ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.