News March 8, 2025

MNCL: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

మంచిర్యాలలోని ఓవర్ బ్రిడ్జి సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వయసు 29 సంవత్సరాలు ఉండగా.. తెలుపు రంగు పుల్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. జీఆర్పీ ఎస్ఐ మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658596, 9849058691 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Similar News

News March 18, 2026

భువనగిరి: పీఎం కిసాన్ పథకానికి ఈ రైతులు దూరం..!

image

భువనగిరి జిల్లాలో సుమారు 2.85 లక్షల మంది రైతులు ఉండగా, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన 25 వేల మందికి పైగా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందడం లేదు. 2019 తర్వాత కేంద్రం కొత్త దరఖాస్తులకు అవకాశం ఇవ్వకపోవడంతో వీరు పెట్టుబడి సాయానికి దూరమయ్యారు. గత ఏడేళ్లలో జిల్లాలో సుమారు 30 వేల మంది పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం గమనార్హం.

News March 18, 2026

HYD: రీల్స్‌లో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారా.. జాగ్రత్త!

image

SM వేదికగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సెక్యూరిటీ గార్డు వెంకన్నను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు చెందిన సోషల్ మీడియా ‘రీల్’ కింద ఇతడు అత్యంత అసభ్యకరమైన కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ PSకి తరలించి విచారణ చేస్తున్నారు.

News March 18, 2026

పితృత్వ సెలవులు ఇవ్వాలి: సుప్రీంకోర్టు

image

దేశంలోని ఉద్యోగులందరికీ పితృత్వ సెలవులు వర్తించే విధంగా చట్టం తేవాలని SC అభిప్రాయపడింది. దత్తతలో <<19406877>>మాతృత్వ<<>> సెలవులపై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిలో తండ్రుల పాత్ర కీలకమని, నవజాత శిశువులకు నాన్న మాటలు, స్పర్శ ఎంతో అవసరమని పేర్కొంది. పిల్లల పెంపకం ఏ ఒక్కరి పనో కాదని, వారి బాధ్యతను సమానంగా పంచుకోవాలంది. కాగా ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు ఉద్యోగులకు ఇది అమల్లో ఉంది.