News March 8, 2025

డ్రంక్‌అండ్‌డ్రైవ్‌ కేసులో వినూత్న తీర్పు

image

భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివ నాయక్ శుక్రవారం వినూత్న తీర్పును ఇచ్చారు. భద్రాచలం, బూర్గంపాడుతో పాటు భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ముద్దాయిలకు జరిమానాతో పాటు కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా కోర్టు ఆవరణలో మొక్కలు నాటలసిందిగా ఆయన తీర్పునిచ్చారు. దీంతో వారు మొక్కలు నాటారు.

Similar News

News March 11, 2026

కాకినాడ వాసికి కీలక పదవి

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) ఛైర్మన్, సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ ఛైర్మన్‌గా కాకినాడకు చెందిన వెటుకూరి ఏవీఎస్ఎస్ఎన్ రాజును నియమించారు. పదవీకాలం మూడు సంవత్సరాలు లేదా గరిష్ఠంగా ఛైర్మన్‌కు 65 ఏళ్లు, సభ్యులకు 60 ఏళ్లు నిండేవరకు కొనసాగుతారు. ఈ నియామకం ద్వారా బాలల హక్కుల పరిరక్షణ మరింత వేగవంతం కానుంది.

News March 11, 2026

సంగారెడ్డి: ఇస్రో స్పేస్ ట్రైనింగ్‌లో 42 మంది విద్యార్థులు

image

జేఎన్టీయూహెచ్‌లోని UCESTH నుంచి 42 మంది విద్యార్థులు ఇస్రో నిర్వహిస్తున్న START-2026 స్పేస్ సైన్స్ శిక్షణకు ఎంపికయ్యారు. ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ సమక్షంలో ఈ ఆన్‌లైన్ శిక్షణ ప్రారంభమైంది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 2 వరకు మొత్తం 26 ఆన్‌లైన్ ఉపన్యాసాలు నిర్వహించనున్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

News March 11, 2026

400 మిలియన్ బ్యారెళ్ల చమురు రిలీజ్ చేయనున్న IEA

image

అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) ప్రకటించింది. క్రూడ్ ఆయిల్ ధరలను నియంత్రించేందుకు 32 సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. IEA వద్ద ప్రస్తుతం 1.2 బిలియన్ బ్యారెళ్లకుపైగా చమురు నిల్వలు ఉన్నాయి. ఇలా IEA ఆయిల్ రిలీజ్ చేయడం ఇది ఆరోసారి. గతంలో 1991, 2005, 2011 సహా 2022లో రెండుసార్లు ఆయిల్ రిలీజ్ చేసింది.