News March 8, 2025

ఏలూరు జిల్లాను నడిపిస్తున్న ఆ నలుగురు మహిళలు

image

అడ్మినిస్ట్రేషన్, విద్య, వైద్యం ముఖ్యమైన విభాగాలు. ఏలూరు జిల్లాలో ప్రస్తుతం ఆ నాలుగు శాఖలను మహిళలే నిర్వహించటం విశేషం. జిల్లా కలెక్టర్‌గా వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్‌గాధాత్రి రెడ్డి సేవలు అందిస్తున్నారు. మరోవైపు DMHOగా మాలిని, డీఈవోగా వెంకట లక్ష్మమ్మ పనిచేస్తున్నారు. ఇలా ఆ నలుగురు జిల్లాను నడిపిస్తున్నారు. మహిళలు ఎందులోనూ తక్కవ కాదనేందుకు వీళ్లే ఆదర్శం.
#HappyWomensDay

Similar News

News March 6, 2026

కుంభాభిషేకంతో ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవలు రద్దు

image

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కుంభాభిషేక
ఉత్సవ నిర్వహణ దృష్ట్యా ఇరోజు నుండి 9 వరకు ఆలయంలో నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేసారు. ఈ 4 రోజుల పాటు అన్ని సేవలను, ప్రత్యేక పూజలను దేవస్థానమే “సర్కార్ సేవ” కింద పరోక్షంగా సేవలు నిర్వహిస్తుందని ఈఓ శీనానాయక్ అన్నారు. ఈ మూడు రోజులు భక్తులకు కేవలం ముఖ మండపం సర్వదర్శనం క్యూ లైన్ల ద్వారా అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామన్నారు.

News March 6, 2026

అనకాపల్లి: రేకుల షెడ్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

ఎస్ రాయవరం(M) కొరుప్రోలు గ్రామంలోని సత్య వినాయక కొబ్బరి పీచు పరిశ్రమ స్టోరేజ్ షెడ్‌పై మరమ్మతు పనులు చేస్తుండగా గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎస్ రాయవరం గ్రామానికి చెందిన వెల్డర్ కొమ్ము నూకరాజు (50) షెడ్‌పై నుంచి జారి పడి తీవ్ర గాయాలపాలైయ్యాడు. అతనిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందాడని, దీనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ విభీషణరావు తెలిపారు.

News March 6, 2026

మొక్క జొన్న రైతుల బకాయిలు విడుదల

image

TG: మొక్క జొన్న రైతుల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. మార్క్‌ఫెడ్‌కు ₹171 కోట్లు రిలీజ్ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఒకటీరెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. ‘వానాకాలానికి సంబంధించి 78,500 మంది నుంచి 3.77 లక్షల టన్నుల మొక్కజొన్నలు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. తొలిదశలో ₹735.39 కోట్లు చెల్లించాం. మిగతా నిధులను తాజాగా రిలీజ్ చేశాం’ అని పేర్కొన్నారు.