News March 8, 2025
పోరాడదాం రండి.. నేడు అన్ని పార్టీల ఎంపీలతో సీఎం భేటీ

TG: రాష్ట్రానికి పెండింగ్ ప్రాజెక్టులను సాధించడమే లక్ష్యంగా ఇవాళ అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్‌తోపాటు లోక్‌సభ ఎంపీలకు ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్ర రుణ భారం తగ్గించుకోవడం, కేంద్రం నుంచి పన్నుల వాటా పెంపు, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌పై చర్చించనున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణను రూపొందిస్తారు.
Similar News
News November 12, 2025
TG, AP న్యూస్ రౌండప్

✦ DEC 20 నాటికి మేడారం అభివృద్ధి పనులు పూర్తి: మంత్రి పొంగులేటి
✦ రాష్ట్రంలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు.. నిబంధనలు ఉల్లంఘించే వెహికల్స్‌కు భారీ ఫైన్: మంత్రి పొన్నం
✦ DEC 3 నుంచి అందుబాటులోకి TG SET హాల్ టికెట్లు
✦ విజయవాడలో 249kgs గంజాయి పట్టుకున్న ఈగల్ టీమ్
✦ ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో నలుగురు నిందితులకు ఈ నెల 25 వరకు రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు
News November 12, 2025
రాజమౌళి-మహేశ్ బాబు మూవీ.. ప్రియాంక పోస్టర్ రిలీజ్

రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో హీరోయిన్ ప్రియాంకా చోప్రా పాత్రను పరిచయం చేస్తూ రాజమౌళి పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఆమె చీర ధరించి, చేతిలో గన్ పట్టుకుని అగ్రెసివ్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ప్రియాంక ‘మందాకిని’ పాత్రలో నటిస్తున్నారని జక్కన్న తెలిపారు. Welcome back, Desi Girl! అని ట్వీట్ చేశారు.
News November 12, 2025
టెర్రరిజంపై అమెరికా ద్వంద్వ నీతి.. మరోసారి బట్టబయలు!

టెర్రరిజం విషయంలో అమెరికా ద్వంద్వ నీతి మరోసారి బట్టబయలైంది. భారత్‌లో దాడులు జరిగితే ఒకలా, పాక్‌లో అయితే మరోలా స్పందించింది. ఎక్కడా టెర్రరిజం అనే పదం వాడకుండా ఢిల్లీ పేలుడుపై US ఎంబసీ ట్వీట్ చేసింది. అదీ ఘటన జరిగిన ఒకరోజు తర్వాత ఓ పోస్టుతో మమ అనిపించింది. పాక్‌లో దాడులు జరిగితే మాత్రం వెంటనే స్పందించి మొసలి కన్నీరు కార్చింది. టెర్రరిజంపై పోరులో పాకిస్థాన్‌కు సంఘీభావం తెలుపుతున్నట్లు ట్వీట్ చేసింది.


