News March 8, 2025
అద్దంకిలో వ్యక్తి ఆత్మహత్య

తిమ్మాయిపాలెంకు చెందిన కోటేశ్వరరావు(37) ఇంట్లో ఉరివేసుకొని మరణించాడు. అద్దంకి S.I ఖాదర్ బాషా తెలిపిన వివరాల మేరకు.. రోజువారి కూలి పనులు చేసే కోటేశ్వరరావు వివిధ ఫైనాన్స్ కంపెనీలలో అప్పు తీసుకున్నాడు. అదే సమయంలో తన కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో మానసికంగా కృంగిపోయి శుక్రవారం ఇంట్లో ఉరివేసుకొని మరణించినట్లు భార్య ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 18, 2026
‘5 రాష్ట్రాలు దాటి వచ్చారా?’.. అల్లు అర్జున్ పిటిషన్‌పై ఢిల్లీ HC

తన పర్సనాలిటీ రైట్స్ పరిరక్షించాలని అల్లు అర్జున్ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ HC ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఢిల్లీ, TGకి మధ్య 5 రాష్ట్రాలున్నాయి. ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు’ అని జస్టిస్ తుషార్ రావు ప్రశ్నించారు. దీనిపై అల్లు అర్జున్ న్యాయవాది స్పందిస్తూ.. హక్కుల ఉల్లంఘన దేశమంతటా జరుగుతోందని, అందుకే రావాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో బన్నీ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలని జడ్జి ఆదేశాలిచ్చారు.
News April 18, 2026
నెల్లూరు: ఉద్యోగులకూ సమస్యలు

నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో ఉద్యోగుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ డే శుక్రవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు తరలి వచ్చారు. తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుకు వివరించారు. ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పటి వరకు 4 శుక్రవారాలు ఉద్యోగుల గ్రీవెన్స్ డే చేపట్టగా.. 235 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 172 పరిష్కారించారు.
News April 18, 2026
మారని కోల్‘కథ’.. ఇక ఇంటికేనా?

IPL 2026లో KKR పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. 6 మ్యాచుల్లో 5 ఓడగా, వర్షం వల్ల ఒకటి రద్దయింది. ఇంకా 8 మ్యాచులు మిగిలి ఉండటంతో కనీసం 7 గెలిస్తే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం టీమ్ ఆట తీరు చూస్తే అది అనుమానమే. ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తుందా అనేలా తయారైంది పరిస్థితి. అసాధారణ రీతిలో పుంజుకుంటే తప్ప ప్లే ఆఫ్స్ రేసులో నిలవడం దాదాపు అసాధ్యం. మీరేమంటారు?


