News March 8, 2025

తుని: టీడీపీలో చేరిన వైస్ ఛైర్‌పర్సన్ రూపాదేవి 

image

తుని మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ పెద్దలతో కలిసి తేటగుంట క్యాంప్ కార్యాలయానికి వచ్చిన రూపాదేవి, లాంఛనప్రాయంగా టీడీపీలో చేరారు. ఇప్పటికే ప్రభుత్వ విప్ యనమల దివ్యను మర్యాదపూర్వకంగా కలిసిన రూపాదేవి, పార్టీకి మద్దతు ప్రకటించారు. అనంతరం, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆమెకు పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Similar News

News March 20, 2026

‘కాకినాడలో ఈనెల 24న జాబ్ మేళా’

image

ఈనెల 24న జిల్లా ఉపాధి కార్యాలయంలో 62 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్ పే, రామకృష్ణ ఎలక్ట్రికల్ వర్క్స్ వంటి సంస్థలలో పనిచేసేందుకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న టెన్త్ నుంచి డిగ్రీ చదివినవారు ఆరోజున ఉదయం10 గంటలకు ధ్రువపత్రాలతో కాకినాడ ఉపాధి కార్యాలయానికి హాజరుకావాలన్నారు.

News March 20, 2026

శ్రీధర్ అజ్ఞాతం వీడినట్టే…!

image

రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతం వీడి ప్రజా సేవకు వచ్చారు. 3నెలల క్రితం ఎమ్మెల్యేపై ఓ మహిళ ఆరోపణలు పెను దుమారం రేపాయి. పార్టీ పరంగా ఆయనను దూరం పెట్టారు. ఎలాంటి కార్యక్రమాల్లో ఆయన కనిపించలేదు. అసెంబ్లీకి సైతం వెళ్లలేదు. అకాల వర్షాల కారణంగా ఓబులవారిపల్లిలో దెబ్బతిన్న అరటి పంట రైతులను శుక్రవారం అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. మరోవైపు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోవడాన్ని మహిళ ఖండిస్తోంది.

News March 20, 2026

విశాఖ: 26న పనికిరాని పాత 104 వాహనాల వేలం

image

విశాఖ జిల్లాకు సంబంధించిన పనిచేయని 104 సేవల పనికిరాని పాత వాహనాలను ఈ-వేలం వేయనున్నట్టు DMHO జగదీశ్వర రావు శుక్రవారం తెలిపారు. మొత్తం 20 పనికిరాని వాహనాలను మార్చి 26న ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఆన్‌లైన్ ద్వారా ఈ-వేలం వేయనున్నట్టు చెప్పారు. వేలం నియమనిబందనలు https://konugolu.ap.gov.in పోర్టల్‌లో పొందుపరిచారు. పూర్తి వివరాలకు పోర్టల్‌లో చెక్ చేయాలన్నారు.