News March 8, 2025
Way2News Special.. వరంగల్ను శాసిస్తున్న మహిళా శక్తి

ఓరుగల్లును మరోసారి మహిళా శక్తి శాసిస్తోంది. ఒకప్పుడు రుద్రమదేవి పరిపాలనలో గొప్ప శోభను అందుకున్న వరంగల్ రాజ్యం,నేడు అనేక కీలక పదవుల్లో మహిళా నేతలు, అధికారులతో మరో చరిత్ర సృష్టిస్తోంది.మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, వరంగల్ ప్రాంతాన్ని నడిపిస్తున్న మహిళా నేతల కృషిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కీలక హోదాల్లో మహిళలు ప్రభుత్వ పరిపాలన నుంచి రాజకీయాల వరకు భాగమవుతున్నారు. HAPPY WOMEN’S DAY.
Similar News
News July 8, 2025
WGL: నేడు 118 విద్యాలయాల్లో ‘స్ఫూర్తి’

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో స్ఫూర్తి
కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 118 విద్యాలయాల్లో బ్యాంకర్లు, జర్నలిస్టులు, సీనియర్ సిటిజన్లు సమాజంలో జరుగుతున్న సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.
News July 8, 2025
వరంగల్ జిల్లాలో 37.6 శాతం వర్షాపాతం నమోదు

జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో వర్షపాతం మోస్తరుగా నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 37.6 శాతం నమోదైంది. గీసుకొండ, దుగ్గొండి, నల్లబెల్లి, ఖిలా వరంగల్, మండలాల్లో మోస్తరు వర్షం కురవగా పర్వతగిరిలో వర్షం కురువలేదని తెలిపారు. వర్ధన్నపేట, రాయపర్తి, ఖానాపూర్, చెన్నారావుపేట, ఖానాపూర్, నర్సంపేట, మండలాల్లో తక్కువ వర్షాపాతం నమోదైంది.
News July 8, 2025
రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా సూర్యనారాయణ

రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా వరంగల్కు చెందిన సూర్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. రేషన్ డీలర్ల కష్ట సుఖాలు పాలుపంచుకుని వారి సమస్యలు తీర్చడానికి సంఘం తరఫున అన్ని విధాలా ముందు ఉంటానని హామీ ఇచ్చారు. పోస్ట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.