News March 8, 2025

కైలాసగిరి రోప్ వే సిబ్బందిపై చర్యలకు ఆదేశాలు

image

కైలాసగిరి రోప్ వే సమీపంలో అగ్నిప్రమాదానికి బాధ్యులైన రోప్ వే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని వీఎంఆర్డిఏ ఎంసీ విశ్వనాథన్ ఆదేశించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆయన సంఘటనా స్థలంలో రోప్‌వే వ్యర్థాలను వెంటనే తొలగించాలన్నారు. కైలాసగిరి దుకాణదారులందరూ అగ్ని ప్రమాదాల నియంత్రణ సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తరచుగా ఫైర్ ఆడిట్ జరిపించాలని ఆదేశించారు.

Similar News

News February 26, 2026

FLNAT పరీక్షకు హాజరుకావాలి: కలెక్టర్

image

విశాఖలో ఫిబ్రవరి 28న వయోజన విద్యార్థులకు ప్రీ-ఫైనల్ FLNAT పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉల్లాస్, అక్షరాంధ్ర పథకాల కింద 15 ఏళ్లు పైబడిన వారికి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఈ పరీక్ష జరుగుతుంది. 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యమని, అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News February 26, 2026

రుషికొండ: ప్రమాదవశాత్తు సముద్రంలో పడి యువకుడి మృతి

image

రుషికొండ సమీపాన బేపార్క్ వద్ద ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన స్వప్నిల్ చౌహాన్ (25) స్నేహితులతో కలిసి విశాఖ వచ్చాడు. గురువారం మధ్యాహ్నం బీచ్ వద్ద ఫొటోలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి సముద్రంలో పడిపోయినట్లు స్నేహితులు తెలిపారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 26, 2026

విశాఖ :రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.05 కోట్లు అందజేత

image

రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్&రన్‌లో చనిపోయిన ఎలమంచిలి రాజు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, దువ్వాడకు చెందిన అను, తరిణి లక్ష్మి, మెంటాడకు చెందిన సురేశ్ యాక్సిడెంట్‌లో గాయపడడంతో వారి ఖాతాలో రూ.50వేలు చొప్పున జమ చేశామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో హిట్ & రన్‌‌ కేసుల్లో 129 మంది బాధితులకు మొత్తం రూ.1.05 కోట్లు అందించామన్నారు.