News March 8, 2025

Rewind: పల్నాడులో 23 మందిని చంపిన నిందితులకు క్షమాభిక్ష

image

32 ఏళ్ల క్రితం నరసరావుపేటలో 23 మందిని కాల్చి చంపేసిన ఘటనలో నిందితులు చలపతి, విజయవర్ధ‌న్‌ను 1993 మార్చి 18న పోలీసులు అరెస్ట్ చేశారు. 96 ఆగస్టు 28న సుప్రీంకోర్టు వారికి మరణశిక్ష విధించింది. 1997 మార్చి 29న వారి ఉరిశిక్షకు ఏర్పాట్లు చేశారు. వారు రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అది పెండింగ్లో ఉండటంతో ఉరిశిక్ష వాయిదా వేయాలని సుప్రీమ్ ఆదేశించింది.

Similar News

News January 13, 2026

మన ఊరు దగ్గరవుతున్న కొద్దీ ఆ ఫీలింగే వేరు!

image

సంక్రాంతికి పట్టణాలన్నీ ఖాళీ అవుతుండగా పల్లెలు సందడిగా మారాయి. ఇప్పటికే కొందరు సొంతూళ్లకు చేరుకోగా, మరికొందరు ప్రయాణాల్లో ఉన్నారు. అయితే మన ఊరు కొద్ది దూరంలో ఉందనగా కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేనిదని పలువురు SMలో పోస్టులు పెడుతున్నారు. పేరెంట్స్, ఫ్రెండ్స్, స్కూల్, చెరువు, పొలాలు తదితరాలు గుర్తుకొస్తాయి. పండగకి ఊరెళ్లేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో.. తిరిగొచ్చేటప్పుడు అంతే బాధగా అన్పిస్తుంది కదా?

News January 13, 2026

ప్రభుత్వం పనితీరుపై చిత్తూరు ప్రజల స్పందన ఇదే..!

image

ప్రభుత్వ సేవలు అందడంలో చిత్తూరు జిల్లాలో 66% మందే సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడిలో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పింఛన్ల పంపిణీపై 85.4, అన్న క్యాంటీన్లపై 84.4, దీపం పథకంపై 66.2, ఆర్టీసీ బస్సులపై 70.9, వైద్య సేవలపై 62.4, రిజిస్ట్రేషన్ సేవలపై 64.2, హౌసింగ్ పథకంపై 52.9, రెవెన్యూ సేవలపై 45.5, రెవెన్యూ సర్వేపై 45.1 శాతం సంతృప్తి ఉందని వివరించారు.

News January 13, 2026

మెదక్: కౌన్సిలర్ అభ్యర్థుల్లో రిజర్వేషన్ టెన్షన్

image

మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలో మోగనుండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటరు జాబితా విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి రిజర్వేషన్లపైనే ఉంది. తమ వార్డు ఏ వర్గానికి కేటాయిస్తారోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు టికెట్ల కోసం పైరవీలు ముమ్మరం చేస్తూనే, వార్డుల్లో ప్రచారం మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఖరారైతేనే పోటీపై స్పష్టత రానుంది.