News March 8, 2025
చాగలమర్రిలో 40.6°C

నంద్యాల జిల్లా చాగలమర్రిలో రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా 40.6°C ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. మరో రెండు నెలలు ఈ ఎండలు కొనసాగే అవకాశం ఉందని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. ఎండలో తిరగడం నివారించాలని, ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Similar News
News November 10, 2025
జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మకు మాతృవియోగం

నెల్లూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాతృమూర్తి కోడూరు సరస్వతమ్మ గత రాత్రి మృతి చెందారు. దివంగత కోడూరు అయ్యప్ప రెడ్డి సతీమణి వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి అత్త గత అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు బాలాజీ నగర్‌లో అంతిమయాత్ర సాగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News November 10, 2025
ఊర్కొండ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

మూడు రోజుల నుంచి నాగర్ కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయాయి. జిల్లాలోని ఉర్కొండ మండలంలో గడచిన 24 గంటలలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. బిజినేపల్లి, వెల్దండ మండలాలలో సైతం 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కల్వకుర్తిలో 15.4, పదరలో 15.6, ఉప్పునుంతలలో 15.7, తాడూరులో 15.7, అమ్రాబాద్ లో 15.8, నాగర్‌కర్నూల్‌లో 15.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News November 10, 2025
నిజామాబాద్: కొనసాగుతున్న అనిశ్చితి

డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. హైకమాండ్ నిర్ణయం వాయిదా పడటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాల వారీగా పేర్లను ఖరారు చేసినప్పటికీ, చివరి ఆమోదం కోసం వేచిచూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆలస్యం కారణంగా జిల్లా స్థాయి పార్టీ కార్యకలాపాలు మందగిస్తున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి NZBలో ఎవరెవరు అధ్యక్షులైతే బాగుంటుందో కామెంట్ చేయండి.


