News March 8, 2025

నేడు ఈ మండలాల్లో వడగాల్పులు

image

AP: రాష్ట్రంలోని <>80 మండలాల్లో<<>> ఇవాళ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మన్యం, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని అంచనా వేసింది. శ్రీకాకుళం-5, విజయనగరం-12, మన్యం-14, అల్లూరి-7, కాకినాడ-5, తూర్పుగోదావరి-10, ఏలూరు-5, కృష్ణా-7, NTR-6, గుంటూరు-5, పల్నాడు జిల్లాలోని 4 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Similar News

News April 3, 2026

మొన్న క్లాసెన్, నిన్న అభిషేక్.. SRH ఫ్యాన్స్ ఆగ్రహం

image

IPL: SRH బ్యాటర్లు క్లాసెన్, అభిషేక్ క్యాచ్ ఔట్ డెసిషన్లపై ఆ జట్టు ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. MAR 28వ తేదీన RCB మ్యాచులో క్లాసెన్ క్యాచ్ పట్టిన సాల్ట్ బౌండరీ లైనుకు తగిలినా ఔట్ ఇచ్చారని చర్చ జరిగిన విషయం తెలిసిందే. నిన్న KKRతో మ్యాచులో అభిషేక్ క్యాచును వరుణ్ అందుకున్నారు. బాల్ బౌన్స్ అయి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లినట్లు కనబడుతున్నా థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చారని మండిపడుతున్నారు. ఈ 2 ఔట్‌లపై మీ COMMENT.

News April 3, 2026

శర్వానంద్ ‘బైకర్’ మూవీ రివ్యూ&రేటింగ్

image

తన కొడుకు మోటోక్రాస్ ఛాంపియన్‌ కావాలని కలల కనే తండ్రి(రాజశేఖర్), మధ్యలోనే రేసింగ్ ఆపేసే కొడుకు(శర్వానంద్) మధ్య జరిగే కథే బైకర్. శర్వా, రాజశేఖర్ నటనతో మెప్పించారు. బైక్ రైడింగ్ విజువల్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి. హీరోయిన్ మాళవిక పాత్రకు ప్రాధాన్యం దక్కింది. కొన్ని డైలాగులు బాగున్నాయి. మ్యూజిక్ ఫర్వాలేదు. ఎమోషన్ సీన్లు పెద్దగా వర్కౌట్ కాలేదు. కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే మైనస్.
రేటింగ్: 2.5/5

News April 3, 2026

ముగిసిన టెన్త్ పరీక్షలు.. 6 నుంచి వాల్యుయేషన్

image

AP: మార్చి 16వ తేదీన మొదలైన టెన్త్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని ప్రధాన సబ్జెక్టుల్లో 99.05% అటెండెన్స్ నమోదైంది. 3,415 ఎగ్జామ్ సెంటర్లలో 6,22,152 మంది రెగ్యులర్.. 19,568 మంది ప్రైవేట్ అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పేపర్ల వాల్యుయేషన్ జరగనుంది. ఈ నెల నాలుగో వారంలో రిజల్ట్స్ వచ్చే అవకాశముంది.