News March 8, 2025

హైదరాబాద్ అమ్మాయి.. నీ ప్రతిభకు సలాం

image

HYD పేరు నిలబెడుతోందీ ఈ సింగర్. ఆధ్యాత్మిక పాటలతో సంగీత ప్రియులను కట్టిపడేస్తూ దేశ, విదేశాల్లో 650 పైగా కల్చరల్ ఈవెంట్‌లలో పాల్గొంది. 9 ఏళ్ల వయసులోనే తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్‌లో 17 కీర్తనలతో అల్బమ్ విడుదల చేసింది. తన ప్రతిభతో ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’లో పేరుతెచ్చుకుంది. బర్కత్‌పురాలో ఉండే వివేక్ ఆనంద్, సుచిత్ర దంపతుల కుమార్తెనే ఈ మాళవిక ఆనంద్. ఓ మగువా నీ ప్రతిభకు సలాం.
HAPPY WOMEN’S DAY

Similar News

News September 16, 2025

నేడు HYDకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

image

నేడు హైదరాబాద్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. SEP 17 సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే విమోచన దినోత్సవాలకు హాజరవుతారు. పలువురు కేంద్రమంత్రులు, మహారాష్ట్రకు చెందిన మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

News September 15, 2025

కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య.. జైలుకు నిందితులు

image

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేణు అగర్వాల్ హత్యకేసులో కీలక పరిణామం జరిగింది. రాంచీ నుంచి నిందితులు హర్ష, రోషన్, రాజ్ వర్మను పోలీసులు కూకట్‌పల్లికి తీసుకొచ్చారు. ట్రాన్సిట్ వారెంట్‌పై స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. కంది జైలుకు తరలించినట్లు సమాచారం.

News September 15, 2025

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర: కేటీఆర్

image

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలని KTR పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ఆగం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.