News March 8, 2025
Way2News Special.. కొత్తగూడెం జిల్లాలో ఆ తల్లి యోధురాలు

ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవరూ లేరని ఆమె నిరూపించారు. ఓవైపు భర్త చనిపోయాడు.. పిల్లలిద్దరూ చిన్నవాళ్లు.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు.. పట్టించుకునే వారు ఎవరూ లేరు.. ఇంతటి పరిస్థితిలో ఆమె ధైర్యం కోల్పోలేదు. కష్టాలకు ఎదురు నిలిచి ఫోక్ సింగర్‌గా మారింది. ఆమే కొత్తగూడెం(D), అశ్వాపురం(M), మల్లెలమడుగు వాసి తాళ్లూరి దేవమణి.. ఫోక్ సాంగ్స్ పాడి గుర్తింపు పొందిన ఆమెకు AICRU 2023లో డాక్టరేట్ ఇచ్చింది.
Similar News
News November 10, 2025
పెద్దపల్లి: విషాదం.. బావిలో పడి యువకుడు మృతి

PDPL(D) కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన సూరం శ్యాంరాజ్(24) బావిలో పడి మృతి చెందాడు. వివరాలు.. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్యాంరాజ్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం గ్రామ శివారులోని బావిలో శ్యాంరాజ్ మృతదేహం కనిపించింది. దీంతో తారుపల్లిలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 10, 2025
ప్రజావాణికి 158 వినతులు.. సత్వర పరిష్కారంపై కలెక్టర్ ఆదేశం

హన్మకొండ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి 158 వినతి పత్రాలు అందినట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అర్జీలను స్వీకరించి, సత్వర పరిష్కారం కోసం సంబంధించిన శాఖలకు పంపించారు. గ్రీవెన్స్ వినతులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News November 10, 2025
పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి: తుల రవి

డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని అందించే రాష్ట్ర స్థాయి పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి తల రవి తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు ఈనెల 19వ తేదీలోగా వివిధ కేటగిరీలలోని పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకుhttps://wdsc.telangana.gov.in సంప్రదించాలన్నారు.


