News March 8, 2025

ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగంలో తెనాలి మహిళ ప్రముఖ పాత్ర

image

ఇస్రో తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగంలో తెనాలికి చెందిన మహిళ ప్రముఖ పాత్ర పోషించారు. గంగానమ్మపేటకు చెందిన కొత్తమాసు సాయిదివ్య, రఘురామ్‌ దంపతులు ‘ఎన్‌ స్పేస్‌ టెక్నాలజీ’ సంస్థను నిర్వహిస్తున్నారు. కేఎల్‌యూలో రాడర్‌ కమ్యూనికేషన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న సాయిదివ్య 2022 నవంబరులో ఇస్రో పంపిన విక్రమ్‌-ఎస్‌ ప్రైవేట్‌ రాకెట్‌లో ఉంచిన మూడు పేలోడ్‌లలో ఒక పేలోడ్‌ను ఈమె తయారు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం అయింది.

Similar News

News December 30, 2025

గుంటూరు జిల్లాలో కేకులు, స్వీట్లకు భారీ డిమాండ్

image

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేకులు, స్వీట్ల విక్రయాలు భారీగా పెరిగాయి. బేకరీలు, స్వీట్ షాపులు రద్దీగా మారాయి. కేకులు, స్వీట్లు ధరలు సాధారణ రకం రూ. 200 నుంచి ప్రారంభమవుతుండగా, ప్రత్యేక డిజైన్ కేకులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కుటుంబాలు, యువత కొత్త సంవత్సరాన్ని మధురంగా ఆహ్వానించేందుకు ముందస్తుగా ఆర్డర్లు ఇస్తుండటంతో వ్యాపారుల్లో ఉత్సాహం నెలకొంది.

News December 30, 2025

GNT: ఉల్లాస్ అక్షర ఆంధ్రపై వీసీ నిర్వహించిన కలెక్టర్

image

జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంను నిర్దేశిత లక్ష్యాలకు మేరకు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె ఉల్లాస్ అక్షర ఆంధ్రపై వీసీ చేపట్టారు. మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సీఎంఎంలు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఏపీఓలు పాల్గొన్నారు.

News December 30, 2025

గుంటూరు జిల్లాను ఆదర్శంగా నిలపాలి: కలెక్టర్

image

గృహ నిర్మాణ లక్ష్యాలు మార్చి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. గృహ నిర్మాణంపై అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఆప్షన్ 3 గృహాలలో స్టేజ్ డివియేషన్ ఉన్నవాటిని గుర్తించి వాటిని సరిచేసి పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 5 లక్షల గృహాల నిర్మాణంలో గుంటూరు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో గృహాలు పూర్తిచేసి ఆదర్శంగా నిలవాలన్నారు.