News March 8, 2025

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: కలెక్టర్ హనుమంతరావు

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లా మహిళలందరికీ కలెక్టర్ హనుమంతరావు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన వేడుకలకు హాజరై మాట్లాడారు. మహిళలు ఎదిగితే సమాజం అభివృద్ధి చెందుతుంది, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళా సాధికారతకు తోడ్పడాలన్నారు.

Similar News

News March 8, 2026

ఎమ్మెల్సీ అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

image

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2గా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై నాన్ బైలబుల్ వారెంట్ జారీ అయింది. ఈనెల 5న ఆమెపై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్ట్ ఈ వారంట్ జారీ చేసింది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. డ్రైవర్ హత్య కేసులో దర్యాప్తు చేసిన సిట్.. కోర్టులో అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఈ వారెంట్ జారీ అయినట్లు సమాచారం.

News March 8, 2026

ఈరోజైనా అభి’షేక్’ చేస్తాడా?

image

T20 WCలో నిరాశ పరుస్తున్న భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఇవాళ NZతో ఫైనల్లోనైనా చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫామ్‌లో ఉన్న శాంసన్‌కు తోడు అభి రాణిస్తే బ్యాటింగ్‌లో INDకి తిరుగుండదు. నిన్న ప్రాక్టీస్ టైమ్‌లో అభితో హెడ్ కోచ్ గంభీర్ 40 నిమిషాలపాటు మాట్లాడినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కాగా ఈ WCలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ 7 ఇన్నింగ్స్‌లలో 89 రన్స్ మాత్రమే చేశారు. ఇందులో 3 డకౌట్లు ఉన్నాయి.

News March 8, 2026

WBలో ప్రొటోకాల్ వివాదం.. అమిత్ షా, CBN ఏమన్నారంటే

image

ప.బెంగాల్‌లోని TMC ప్రభుత్వం తమ అరాచక ప్రవర్తనతో అథఃపాతాళానికి దిగజారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ‘ప్రోటోకాల్‌ పాటించకుండా రాష్ట్రపతిని అవమానించారు. <<19322594>>ఈ ఘటన<<>> దేశానికి, ప్రజాస్వామ్యానికి అవమానం’ అని ట్వీట్ చేశారు. రాష్ట్రపతిని అవమానించేలా WB ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని, ఈ ఘటన బాధ కలిగించిందని AP CM CBN తెలిపారు. రాష్ట్రపతి పట్ల గౌరవంతో మెలగాలన్నారు.