News March 8, 2025

NZB: భిక్షాటన పేరుతో వచ్చి.. మెడలో గొలుసు చోరీ

image

భిక్షాటన పేరుతో ఇంట్లోకి చొరబడ్డ ఓ మహిళా ఇంట్లోని వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన ఘటన నిజామాబాద్ మండలం గుండారంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి లక్ష్మి (70) తన ఇంట్లో ఉండగా గుర్తు తెలియని ఓ మహిళా బిక్షాటన >పేరుతొ లక్ష్మి ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో ఎవ్వరూ లేక పోవడంతో ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల గొలుసును లాక్కొని పారిపోయింది. బాధితురాలు నిజామాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిం

Similar News

News April 19, 2026

బీజేపీ డీలిమిటేషన్ పేరుతో కాలయాపన చేస్తోంది: బీర్ల

image

కాంగ్రెస్ పార్టీకి 400 సీట్లు వస్తే పార్లమెంటులో మహిళా బిల్లు ఎప్పుడో పాస్ అయ్యేదని MLA బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్టలో ఆయన మాట్లాడుతూ.. మహిళా బిల్లుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీజేపీ తన స్వార్థం కోసం డీలిమిటేషన్ పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. మహిళా లోకానికి బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిగతా బిల్లులను పక్కనపెట్టి మహిళలకు న్యాయం చేయాలన్నారు.

News April 19, 2026

NTR: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకై ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే

image

సూరంపల్లిలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ(సీపెట్)లో 2026- 27కు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2, 3 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులలో చేరేందుకు https://cipet26.onlineregistrationform.org/CIPET/లో మే 28లోపు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్లకు జూన్ 7న పరీక్ష నిర్వహిస్తామని సీపెట్ అధ్యాపకులు తెలిపారు.

News April 19, 2026

ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన

image

ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. భార్య నరసమ్మపై భర్త రామయ్య కత్తితో దాడి చేశాడు. కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఈ దంపతులు, కూతురు శాంతి ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకొని ఆసుపత్రికి వచ్చిన రామయ్య నరసమ్మపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు రామయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.