News March 8, 2025

ఏలూరు జిల్లాలో 8 నుంచి పి-4 సర్వే: కలెక్టర్

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 8 నుంచి పీ-4 సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సర్వేను విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. అలాగే పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యమని అన్నారు. 

Similar News

News March 14, 2026

రాజమండ్రి: లోక్ అదాలత్‌లో 18,441 కేసుల పరిష్కారం

image

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 18,441 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి గంధం సునీత తెలిపారు. 17,672 క్రిమినల్, 630 సివిల్, 139 ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 18,302 కేసులకు మోక్షం లభించడంతో కక్షిదారులకు ఊరట లభించింది. పరస్పర అంగీకారంతో రాజీ పడటం ద్వారా సమయం ఆదా అవుతుందని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని ఆమె పేర్కొన్నారు.

News March 14, 2026

గుత్తి కోటలో రేపు జరగబోయే కార్యక్రమాలు ఇవే!

image

గుత్తి కోట ఉత్సవాలలో భాగంగా గుత్తిలోని ఫుట్ బాల్ గ్రౌండ్ నుంచి గుత్తి కోట వరకు హెరిటేజ్ వాక్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జ్యోతి ప్రజ్వలన, ప్రార్థన, అతిథుల ప్రసంగం, సంధ్యామూర్తి శ్రీ నృత్య కళానిలయం వారి శివ పాదం, (జబర్దస్త్) డా.శాంతి కుమార్ మిమిక్రీ, గంగమ్మ జాతర చేయనున్నారు.

News March 14, 2026

జగిత్యాల: ‘దేశాన్ని ఏకం చేసేది మన సంస్కృతే’

image

కులం, మతం, భాష, వేషం ఏదైనా మన సంస్కృతి ఒకటేనని, భారతదేశాన్ని ఏకం చేసే మన భారతీయ సంస్కృతినీ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తెలంగాణ ప్రాంత కార్యకారిని సభ్యులు బూర్ల దక్షిణామూర్తి అన్నారు. ఆర్ఎస్ఎస్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉగాది ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ స్వయం సేవకులు పూర్ణ గనవేశతో నగరంలో పత సంచలనం నిర్వహించారు.