News March 8, 2025
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినకపోతే?

ఆరోగ్యకరమైన జీవనానికి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కానీ అల్పాహారాన్ని స్కిప్ చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే టిఫిన్ తినకపోతే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. జీవక్రియ మందగించి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. తలనొప్పి, వికారం, వాంతులు రావచ్చు. ఊబకాయం, అల్సర్, గ్యాస్ సమస్యలకూ దారితీస్తుంది. నిద్ర లేచిన రెండు గంటల్లోగా అల్పాహారం తీసుకోవడం బెటర్.
Similar News
News November 10, 2025
తక్షణ సాయంగా ₹901 కోట్లు ఇవ్వండి: AP

AP: మొంథా తుఫాను నష్టంపై అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ₹6384CR నష్టం వాటిల్లిందని, ₹901.4 కోట్లు తక్షణ సాయంగా అందించాలని రాష్ట్ర అధికారులు కోరారు. 1.61 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు. ఉద్యాన, మల్బరీ తోటలూ దెబ్బతిన్నాయని వివరించారు. 4,794KM రోడ్లు, 3,437 మైనర్ ఇరిగేషన్ పనులు, 2,417 ఇతర ప్రాజెక్టులకు నష్టం వాటిల్లిందని తెలిపారు.
News November 10, 2025
రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా

చిన్నతనం నుంచే అంతరిక్షంపై మక్కువ పెంచుకుని శాస్త్రవేత్త కావాలనుకున్నారు రీతూ కరిధాల్. లక్నోలో జన్మించిన ఈమె 1997లో ఇస్రోలో చేరారు. చంద్రయాన్-2కు మిషన్ డైరక్టర్‌గా వ్యవహరించడంతో పాటు మార్స్ ఆర్బిటార్, మంగళయాన్, చంద్రయాన్-3లో ప్రధానపాత్ర పోషించారు. రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా బిరుదుతోపాటు అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఇస్రోయంగ్ సైంటిస్ట్ అవార్డు, ఫోర్బ్స్ ఇండియా సెల్ఫ్ మేడ్ ఉమెన్-2020 జాబితాలో నిలిచారు.
News November 10, 2025
శివుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి?

☛ విషాన్ని ఆయన గొంతులోనే ఉంచుకొని లోకాన్ని రక్షించినట్లు, మన జీవితంలోని ప్రతికూలతలను నియంత్రించడం నేర్చుకోవాలి.
☛ ఆయన నుదుటిపై మూడో కన్ను జ్ఞానం, వివేకానికి చిహ్నం. అలాంటి వివేకంతో సత్యాసత్యాలను, మంచి-చెడులను గుర్తించే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
☛ శివుడు భస్మం, రుద్రాక్షలతో నిరాడంబరంగా ఉంటాడు. నిజమైన శక్తికి ఆడంబరాలు అనవసరమని అర్థం. ☛ ధ్యానంతో మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణ, ఏకాగ్రత పెంచుకోవాలి.


