News March 8, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

√:ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు√:శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం √:ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన √:మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం √:సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన √:జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు√:నేలకొండపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం √:ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
Similar News
News November 7, 2025
ఖమ్మంలో యాక్సిడెంట్.. యువకుడి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఖానాపురం హవేలీ పోలీసుల కథనం ప్రకారం.. గోపాలపురంలోని కశ్మీర్ దాబా ఎదురుగా అర్ధరాత్రి ఓ యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
News November 7, 2025
ఖమ్మం: వందేమాతరం గీతాలాపనలో ఇన్ఛార్జ్ కలెక్టర్

వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ డా.శ్రీజ, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.శ్రీజ మాట్లాడుతూ.. కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు.
News November 7, 2025
ఖమ్మం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘వందే మాతరం’

జాతీయ గీతం ‘వందేమాతరానికి’ 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఖమ్మం పోలీస్ హెడ్ క్వాటర్స్ పరేడ్ గ్రౌండ్స్, అన్ని పోలీస్ స్టేషన్లలో వందే మాతరం జాతీయ గేయాన్ని సామూహికంగా ఆలపించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ అధికారులందరూ పాల్గొన్నారు. ఈ వేడుకలు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా జరగనున్నాయని పోలీస్ అధికారులు తెలిపారు.


