News March 8, 2025

నిర్మల్: చలి మంటకు సేద తీరుతున్న ఆవు

image

నిర్మల్ జిల్లా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఉదయం, రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. చలికి తట్టుకోలేక మనుషులతో పాటు మూగజీవాలు అల్లాడుతున్నాయి. బాసరలోని కొత్వాల్ గల్లీలో రోడ్డు పక్కన శనివారం ఉదయం చలి నుంచి కాపాడుకునేందుకు పలువురు చలిమంట వేసుకున్నారు. కాగా వారు అక్కడి నుంచి వెళ్లి పోగానే ఓ ఆవు మంట వద్ద సేదతీరింది.

Similar News

News March 12, 2026

నిరుద్యోగులకు అలర్ట్.. ఏడాదికి 2 సార్లే..

image

TGPSC వన్‌టైం రిజిస్ట్రేషన్ (OTR) విధానంలో మార్పులు చేసింది. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే OTRలో మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రతి ఏడాది జనవరి, జూన్ నెలల్లో వారం నుంచి 10 రోజుల పాటు ఓటీఆర్ అప్‌డేట్ విండోను అందుబాటులో ఉంచుతారు. ఆ సమయంలో అదనపు విద్యార్హతలను, ఇతర మార్పులను నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే ఓటీఆర్‌లో అదనపు అర్హతలు నమోదు చేసుకోని వారు, ఈనెల 25లోగా చేసుకోవాలని కమిషన్ సూచించింది.

News March 12, 2026

డ్రగ్స్ రహిత సమాజం కోసం నడుం బిగించాలి: సీఐ

image

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని టాస్క్ ఫోర్స్ సీఐ నటేశ్ పిలుపునిచ్చారు. సిరిసిల్లలోని గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. వ్యసనాల వైపు కాకుండా, క్రీడలు, సృజనాత్మక పనులపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు

News March 12, 2026

HNK: ఇంటర్ పరీక్షలకు 97% హాజరు నమోదు

image

నేటితో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ముగిశాయి. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా నేడు నిర్వహించిన పరీక్షకు 97% హాజరు నమోదయింది. 19,418 మంది విద్యార్థులకు గాను 18,832 మంది పరీక్షకు హాజరుకాగా.. 586 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 513 మంది జనరల్ విద్యార్థులు, 73 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.