News March 8, 2025

వరంగల్‌లో KCR భారీ బహిరంగ సభ

image

BRS పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో మాజీ సీఎం KCR శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో ఆయన కీలక ప్రకటన చేశారు. వరంగల్ గడ్డపై లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులకు సూచనలు చేయగా వారు గ్రౌండ్‌ను పరిశీలించారు.

Similar News

News September 16, 2025

ఉత్తరాంధ్రతో పోటీగా సీమ అభివృద్ధి: చంద్రబాబు

image

AP: అభివృద్ధిలో ఉత్తరాంధ్రతో రాయలసీమ పోటీ పడుతోందని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఉత్తరాంధ్రలో ఆర్సెలార్ మిట్టల్, TCS, గూగుల్ వంటి సంస్థలు వస్తున్నాయి. రాయలసీమలో లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకూ పెద్దఎత్తున పరిశ్రమలు వస్తాయి. శ్రీసిటీతో పాటు తిరుపతి కేంద్రంగానూ పరిశ్రమలు వస్తున్నాయి. పోర్టులు, ఎయిర్ పోర్టులు కూడా వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం’ అని తెలిపారు.

News September 16, 2025

గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ పరివాహక ప్రజలకు ALLERT

image

భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో వర్షం కురుస్తున్నందున ప్రాజెక్ట్ వరద గేట్ల నుంచి నీటిని ఏ క్షణమైన విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోకి (దిగువకు) పశువులు, గొర్రెలు వెళ్లకుండా రైతులు, గొర్రెకాపరులు జాగ్రత్త వహించాలన్నారు. తగిన సూచనలు చేసే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News September 16, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 16, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.11 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.34 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
✒ ఇష: రాత్రి 7.30 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.