News March 8, 2025

మహిళా గళం.. అసెంబ్లీలో తగ్గేదేలే!

image

అసెంబ్లీలో జిల్లా మహిళా ప్రజాప్రతినిధులు గళం విప్పుతున్నారు. ఆసక్తికర స్పీచులతో ఆకట్టుకుంటున్నారు. నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించి పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. MLAలు <>బండారు<<>> శ్రావణి, <<15671355>>సింధూరరెడ్డి<<>>, మంత్రి <<15678997>>సవిత<<>> ఏమాత్రం బెరుకు లేకుండా గళం విప్పుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక సీనియర్ నేత పరిటాల <<15680752>>సునీత<<>> ప్రత్యర్థులకు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు.
#Women’sDay

Similar News

News July 9, 2025

రేపు మరోసారి ఆస్పత్రికి కేసీఆర్

image

TG: బీఆర్ఎస్ అధినేత KCR రేపు ఉదయం మరోసారి HYD సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో 2రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన నంది‌నగర్ నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. రేపు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.

News July 9, 2025

అనకాపల్లి: ‘తల్లి పేరుతో మొక్కను నాటాలి’

image

మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం సందర్భంగా తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. ఇదే ఈ ఏడాది థీమ్‌గా ప్రభుత్వం నిర్ణయించినట్లు బుధవారం పేర్కొన్నారు. విద్యార్థి తల్లితో పాఠశాల ఆవరణలో గానీ వారి ఇంటి వద్ద గానీ మొక్కను నాటాలన్నారు. ఇందుకోసం లీప్ యాప్‌లో వారి పేరు నమోదు చేసుకోవాలన్నారు. పెరుగుతున్న మొక్కకు ప్రతి ఏడాది ఫోటో తీసి అప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.

News July 9, 2025

ఇక మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్!

image

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ భారత్‌లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు మార్గం సుగమమైంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ & ఆథరైజేషన్ సెంటర్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్టార్‌లింక్ జెన్1 లో ఎర్త్ ఆర్బిట్(LEO) శాటిలైట్ ద్వారా ఐదేళ్ల పాటు సేవలందించేందుకు అనుమతులిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.