News March 8, 2025

వేములవాడ: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి

image

వేములవాడ రూరల్ మండలం పాజిల్ నగర్ అటవీ ప్రాంతంలో చిరుతపుడి దాడిలో లేగ దుడ మృతి చెందింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. ఉప్పల నారాయణ అనే రైతు తన లేగ దూడ రోజు మాదిరిగానే పొలం వద్ద కొట్టంలో కట్టేశాడు. రాత్రివేళలో చిరుత పులి దాడి చేయడంతో దూడ మృతిచెందింది. పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు అన్వేషిస్తున్నారు.

Similar News

News March 13, 2026

NRPT: ‘గ్యాస్ కొరత అపోహలను నమ్మవద్దు’

image

వంట గ్యాస్ కొరతపై అపోహలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు ఫణీందర్ రెడ్డి, శ్రీను పాల్గొన్నారు. గ్యాస్ సరఫరాపై తక్షణం సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, ప్రజలకు నిరంతర సరఫరా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

News March 13, 2026

NRPT: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

image

రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యే పది పరీక్షలకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 8:30 గంటల నుంచి 1:30 గంటల వరకు పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. కేంద్రాలకు దగ్గరలో సభలకు, సమావేశాలకు అనుమతి లేదని, జిరాక్స్ దుకాణాలు మూసివేయాలన్నారు.

News March 13, 2026

సాగు, తాగునీటిపై కలెక్టర్ ‘సమీక్ష’

image

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో జిల్లాలో సాగు, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మిర్యాలగూడ నుంచి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.