News March 8, 2025
పెద్దపల్లి జిల్లాలో పగలు వేడి.. రాత్రి చలి

పెద్దపల్లి జిల్లాలో అసాధారణ వాతావరణ పరిస్థితిలో నెలకొన్నాయి. వేసవి నేపథ్యంలో ఎండలు మండుతున్నప్పటికీ రాత్రి సమయంలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. దీంతో జిల్లాలో పగలు అత్యధిక ఉష్ణోగ్రతలు, రాత్రి అత్యంత ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో పాలకుర్తి మండల కేంద్రంలో 38.9℃ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా మంథని మండలంలో 12.9℃ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయింది. ఈ పరిస్థితిపై మీ కామెంట్..?
Similar News
News March 5, 2026
నేడు షా సమక్షంలో నితీశ్ నామినేషన్?

బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేడు కేంద్రహోంమంత్రి అమిత్ షా సమక్షంలో రాజ్యసభ నామినేషన్ వేసే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈరోజు NDA శ్రేణులతో భేటీకి షా బిహార్ రానున్నారు. ఈ సందర్భంగా BJP చీఫ్ నితిన్ నబీన్‌తో పాటు నితీశ్ కూడా షా సమక్షంలో నామినేషన్ వేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే జేడీయూలో ఓ వర్గం ఇందుకు సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో బిహార్ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
News March 5, 2026
మిల్లెట్ మహిమ: 106 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా లక్ష్మమ్మ

నేటి కల్తీ ఆహారపు విషవలయంలో మానవుడి సగటు ఆయువు 70ఏళ్లకే పరిమితమవుతుంటే, నంద్యాల(D) పాములపాడు మండలం చెలిమిళ్లకు చెందిన లక్ష్మమ్మ 106 ఏళ్లు పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వయసులోనూ ఆమె చూపు మందగించకపోవడం, తన పనులు తానే చేసుకోవడం విశేషం. ఆ రోజుల్లో తీసుకున్న రాగి సంగటి, జొన్న రొట్టెలు, కొర్రలు, సజ్జలు వంటి ప్రకృతి సిద్ధమైన ఆహారం ఆమెను నేటికీ ఆరోగ్యంగా ఉంచాయని మేనల్లుడు ఏసన్న తెలిపారు.
News March 5, 2026
సిద్దిపేట: వృద్ధులే లక్ష్యంగా మోసాలు.. జాగ్రత్త

అమాయక వృద్ధ మహిళలను నమ్మించి నగదుతో పాటు 8 తులాల బంగారం కాజేసిన ఇద్దరు నిందితులను సిద్దిపేట టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇల్లు కట్టుకుంటామని నమ్మించి బాధితుల వద్ద నుంచి బంగారం తీసుకుని, వాటిని విక్రయించినట్లు ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అపరిచితులను నమ్మి విలువైన వస్తువులు ఇవ్వొద్దని పోలీసులు సూచించారు.


